- Advertisement -
నకిరేకల్: నల్గొండ జిల్లా నకిరేకల్ బైపాస్ వద్ద జాతీయ రహదారిపై సోమవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కాలేజీ విద్యార్థుల బస్సును వెనుక నుంచి లారీ ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఇప్పటివరకు దాదాపుగా 15 మంది విద్యార్థులకు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను అంబులెన్స్ లో నకిరేకల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మెరుగైన చికిత్స నిమిత్తం సూర్యాపేట ప్రభుత్వ ఏరియా హాస్పిటల్ కు తరలించారు. ప్రమాదం జరిగినప్పుడు బస్సులో కాలేజీ విద్యార్థులు 30 మంది వరకు ఉన్నారు. వీరంతా సూర్యాపేటకు చెందిన అపర్ణ నర్సింగ్ కాలేజ్ విద్యార్థులుగా గుర్తించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.
- Advertisement -