- Advertisement -
సీరోలు: మహబూబూబాద్ జిల్లా సీరోలులో మాజీ ఎమ్మెల్సీ వెంకట్ రెడ్డిని, వారి కుటుంబసభ్యులను రాష్ట్ర గిరిజన, స్త్రీ-శిశుసంక్షేమ శాఖల మంత్రి సత్యవతి రాథోడ్ పరామర్శించారు. వెంకటమ్మ చిత్రపటానికి నివాళులర్పించారు. మాజీ ఎమ్మెల్సీ వెంకట్ రెడ్డిని ఓదారుస్తూ కంటతడి పెట్టుకున్నారు. ఆమె వెంట బిఆర్ఎస్ జిల్లా నాయకులు గుగులోత్ శ్రీరాం నాయక్, సీనియర్ జర్నలిస్ట్ వెంకట్రాం నర్సయ్య తదితరులు ఉన్నారు. మాజీఎమ్మెల్సీ, స్వాతంత్ర్య సమరయోధుడు వెంకట్ రెడ్డి భార్య వెంకటమ్మ శనివారం తుదిశ్వాస విడిచిన విషయం తెలిసిందే.
- Advertisement -