Saturday, December 21, 2024

ఎంఎల్‌సి జీవన్‌రెడ్డికి కాంగ్రెస్ నాయకుల శుభాకాంక్షలు

- Advertisement -
- Advertisement -

పెగడపల్లి: కాంగ్రెస్ ఎంఎల్‌సి తాటిపర్తి జీవన్‌రెడ్డి టిపిసిసి రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యునిగా నియమితులయ్యారు. ఈ మేరకు పెగడపల్లి మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు, ఎంఎల్‌సి జీవన్‌రెడ్డికి పుష్పగుచ్ఛాలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. సోమవారం జగిత్యాల పట్టణంలోని జీవన్‌రెడ్డి నివాసంలో మండల కాంగ్రెస్ నాయకులు మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛాలు అందజేసి అభినందించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ. రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకువచ్చేందుకు కృషి చేస్తామని అన్నారు. రాబోయే రోజుల్లో జీవన్‌రెడ్డి మరిన్ని ఉన్నత పదవులు చేపట్టాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల శాఖ అధ్యక్షుడు బుర్ర రాములు గౌడ్, ఆయా గ్రామాల సర్పంచ్‌లు గోళి మహేందర్‌రెడ్డి, ఈరెల్లి శంకర్, కాంగ్రెస్ పార్టీ మండల ఉపాధ్యక్షుడు సంది మల్లారెడ్డి, తడగొండ రాజు, నాయకులు శ్రీరామ్ అంజయ్య తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News