Monday, December 23, 2024

హైదరాబాద్‌ నుంచి బెంగళూరుకు విస్తరించిన సిద్స్‌ ఫార్మ్‌

- Advertisement -
- Advertisement -

బెంగళూరు: తెలంగాణా కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తోన్న ప్రీమియం డీ2సీ డెయిరీ బ్రాండ్‌, సిద్స్‌ ఫార్మ్‌ నేడు బెంగళూరులో తమ కార్యకలాపాలను విస్తరించినట్లు వెల్లడించింది. బెంగళూరులో సుప్రసిద్ధ ఈ–కామర్స్‌ సైట్స్‌ అయిన మిల్క్‌ బాస్కెట్‌, బిగ్‌ బాస్కెట్‌, జెప్టో, సూపర్‌ డెయిలీ మరియు ఫ్రెష్‌ టు హోమ్‌ పై ఇది లభ్యం కానుంది . దాదాపు 8 కోట్ల మంది జనాభా కలిగిన బెంగళూరులో అత్యుత్తమమైన బ్రాండ్లలో ఒకటిగా సిద్స్‌ ఫార్మ్‌ నిలువనుంది. తొలుత కేవలం ఈ–కామర్స్‌ సైట్ల ద్వారా మాత్రమే పాలు, ఇతర పాల పదార్థాలైనటువంటి పన్నీర్‌, పెరుగె, నెయ్యి, వెన్న అందించనుంది.

బెంగళూరులో కార్యకలాపాలు ప్రారంభించడం గురించి సిద్స్‌ ఫార్మ్‌ ఫౌండర్‌, ఎండీ డాక్టర్‌ కిశోర్‌ ఇందుకూరి మాట్లాడుతూ ‘‘ బెంగళూరులో సిద్స్‌ ఫార్మ్‌ కార్యకలాపాలు ప్రారంభించడం పట్ల సంతోషంగా ఉన్నాము. హైదరాబాద్‌ లాగానే బెంగళూరు వాసులను సైతం ఆకట్టుకోగలమని నమ్ముతున్నాము’’ అని అన్నారు

ఇటీవలనే యంగ్‌ లీడర్‌ ఆఫ్‌ ద ఇయర్‌ (సౌత్‌) అవార్డు 2022ను డేర్‌ టు డ్రీమ్‌ అవార్డుల వద్ద గెలుచుకున్న కిశోర్‌ మాట్లాడుతూ.. ‘‘అత్యున్నత నాణ్యత కలిగిన పాలు, పాల పదార్థాలను ఈ–కామర్స్‌ సైట్ల ద్వారా మాత్రమే తొలుత ఇక్కడ అందించనున్నాము. తదనంతర కాలంలో వినియోగదారులకు తమ యాప్‌, పంపిణీ ఛానెల్‌ ద్వారా అందించనున్నాము’’అని అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News