Saturday, December 21, 2024

ఎఫ్‌టిఎక్స్ వ్యవస్థాపకుడు సామ్ బ్యాంక్‌మన్ అరెస్ట్

- Advertisement -
- Advertisement -

న్యూయార్క్ : దివాలా తీసిన క్రిప్టో ఎక్స్ఛేంజ్ ఎఫ్‌టిఎక్స్ వ్యవస్థాపకుడు సామ్ బ్యాంక్‌మ్యాన్ -ఫ్రైడ్‌ను బహామాస్‌లో అరెస్ట్ చేశారు. అమెరికా ప్రాసిక్యూటర్లు నేరారోపణలు దాఖలు చేసిన తర్వాత బహామాస్‌లో ఫ్రైడ్‌ను అదుపులోకి తీసుకున్నారు. అతడిని అమెరికాకి రప్పించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే మాన్‌హాటన్‌లోని అమెరికా అటార్నీ కార్యాలయం ప్రతినిధి -ఫ్రైడ్ అరెస్టును ధృవీకరించారు. ఎఫ్‌టిఎక్స్ అక్రమాలు వెలుగులోకి వచ్చిన కొద్ది రోజుల్లోనే ఫ్రైడ్‌కు చెందిన 16 బిలియన్ డాలర్ల సంపద సున్నాకి పడిపోయింది. ఒక దశలో సామ్ బ్యాంక్‌మన్ నికర విలువ 26 బిలియన్లు ఉండగా, ఫోర్బ్ జాబితాలోనూ చోటు పొందాడు. లిక్విడిటీ క్రంచ్ తర్వాత ఎఫ్‌టిఎక్స్ ట్రేడింగ్ లిమిటెడ్ దివాలా తీయడంతో అతడి నికర విలువ పతనమైంది. ఎఫ్‌టిఎక్స్ దివాలా వల్ల ప్రపంచ వ్యాప్తంగా 10 లక్షల మందికి పైగా క్రిప్టో ఇన్వెస్టర్లు భారీగా నష్టపోయారు.

ఎలా దివాలా తీసింది?

ఎఫ్‌టిఎక్స్ ప్రపంచంలో రెండో అతిపెద్ద అనుబంధ క్రిప్టో ట్రేడింగ్ కంపెనీ, ఆర్థిక అవాంతరాల కారణంగా ఈ సంస్థలో ఆర్థిక సంక్షోభం ఏర్పడింది. ఈ కారణంగా ఎఫ్‌టిఎక్స్ ట్రేడింగ్ లిమిటెడ్ దివాలా తీసింది. రాయిటర్స్ నివేదిక ప్రకారం, బ్యాంక్‌మ్యాన్ -ఫ్రైడ్ ఎఫ్‌టిఎక్స్ నుండి తన ట్రేడింగ్ ఆర్మ్ అల్మెడ రీసెర్చ్‌కు 10 బిలియన్ డాలర్ల కస్టమర్ ఫండ్‌లను రహస్యంగా బదిలీ చేశాడు. అల్మేడా ఈ నిధిని ట్రేడింగ్ కోసం ఉపయోగించింది. క్రిప్టో ప్రచురణ కాయిన్‌డెస్క్ సంస్థ ట్రేడింగ్‌లో భారీ నష్టాలను చవిచూసినప్పుడు లీక్ అయిన బ్యాలెన్స్ షీట్‌పై ఒక నివేదికను ప్రచురించింది. ఈ నివేదిక వెలువడిన తర్వాత ఎఫ్‌టిఎక్స్‌లో అలజడి మొదలైంది. ఎఫ్‌టిఎక్స్ మూడు రోజుల్లో 6 బిలియన్ డాలర్లు ఉపసంహరణ అభ్యర్థనలను అందుకుంది. కంపెనీ ఉపసంహరణ అభ్యర్థనలను ప్రాసెస్ చేసే స్థితిలో లేకపోవడంతో ఫ్రైడ్ దివాలాకు అభ్యర్థన చేశారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News