Monday, December 23, 2024

మార్కెట్ వ్యర్థాలతో బయో ఇంధనం

- Advertisement -
- Advertisement -

కూకట్‌పల్లి,ఎర్రగడ్డ రైతుబజార్‌లో ఏర్పాటు
దశలవారీగా విస్తరిస్తామంటున్న అధికారులు

మన తెలంగాణ/సిటీబ్యూరో : మార్కెట్లు, రైతుబజార్లల్లో ఉండే అపరిశుభ్ర పరిస్థితులపై మార్కెటింగ్ శాఖ అధికారులు ప్రత్యేక దృష్టిసారించారు. రైతులు తాము తీసుకు వచ్చిన పంటలోని కొంత వ్యర్థాన్ని మార్కెట్లలోనే వదిలేస్తున్నారు. అదే విధంగా వ్యాపారులు కూడా తమ ఉత్పత్తులను ఆయా మార్కెట్లు, రైతుబజార్లలో అమ్ముకున్న తర్వాత మిగిలిన వాటిని ఇక్కడే పడేస్తున్నారు. దాంతో ఆయా మార్కెట్లు, రైతుబజార్లలో అపరిశుభ్ర వాతావరణ ఏర్పడి అనేక రుగ్మతలకు దారి తీస్తున్నాయి.దీంతో అధికారులు మార్కెట్లో, రైతులు బజార్లపై ప్రత్యేక దృష్టి సారించడమే కాకుండా వాటిని వెంటనే అక్కడ తొలిగించే చర్యలు చేపడుతూ మార్కెట్లలో పరిశుభ్రవాతావరణ పరిస్థితులను కల్పిస్తున్నారు. ఇప్పటి ఈ అంశం ప్రత్యేక దృష్టి సారించిన అధికారులు కూరగాయల వ్యర్థాల నుంచి ఎరువును తయారు చేయడమే కాకుండా , వాటిని నుంచి విద్యుత్‌ను ఉత్పత్తి చేసే దిశగా చర్యలుచేపడుతున్నారు. మార్కెట్‌లు,రైతుబజార్లలో కంపోస్టుయూనిట్‌లు,ఎనర్జీ పా ్లంట్ లు,బయోగ్యాస్ ప్లాంట్‌ను ఏర్పాటుచేయడం ద్వారా మార్కెట్లలో చెత్తను తరలించేందుకు చేసే వ్యయం కూడా తగ్గుతోంది.

అంతేకాకుండా వీటి ఏర్పాటుతో మార్కెట్లు పరిశుభ్రంగా ఉండటమే కాకుండా ఆదాయం కూడా రావడంతో అధికారులు వీటి ఏర్పాటుపై ప్రత్యేక దృష్టి సారించారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 3 హోల్ సేల్ మార్కెట్లు ఉండగా 11 రైతుబజార్లు ఉన్నాయి. వీటిలో మార్కెట్ వ్యర్థాలు అధికం కావడంతో వాటిని బయో ఇంధనంగా మార్చేందుకు అధికారులు కృషి చేస్తున్నారు. గతంలో బోయినపల్లి మార్కెట్‌లోని వ్యర్థాలతో ఇంధనం తయారు చేసి మంచి ఫలితాలు రావడంతో బాట సింగారం, ఎర్రగడ్డ, కూకట్‌పల్లి, రైతుబజార్లతో పాటు గుడిమల్కాపూర్ హోల్‌సేల్ వార్కెట్‌లలో కూడా ఇటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు.

చెత్తను ఎత్తివేసేందుకు మార్కెటింగ్ శాఖ ప్రతి నెలా రూ.40 లక్షలు వ్యయం చేస్తోంది ప్రస్తుతం దాన్ని ఆదా చేసేందుకు ప్రణాళికలుసిద్దం చేసింది.సిఎస్ ఐఆర్..ఐఐసిటీ ( కౌన్సిల్ ఆఫ్ సెంటిఫిక్ ఇండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆప్ కెమికల్ టెక్నాలజీ) సాంకేతిక సహకారంతో నగరంలోని మార్కెట్లు, రైతుబజార్లలో బయోగ్యాస్ ప్లాంట్‌ను ఏర్పాటు చేస్తున్నారు. ఇటీవల గుడిమల్కాపూర్ కూరగాయాల మార్కెట్ బయోగ్యాస్ ప్లాంట్‌ను ఏర్పాటు చేశారు. రోజుకు 5 టన్నుల చెత్తను బయోగ్యాస్‌గా మార్చే సామర్ధం ఉంది.బాట సింగరాం ప్లాంట్ ద్వారా రోజు 500 కేజీలను చెత్తను బయోగ్యాస్ మార్చగలరు.ఈ విధంగా ఇప్పటి వరకు 871 కేజీల గ్యాస్ ఉత్పత్తి చేశారు. దీని అక్కడ క్యాంటిన్‌కు సరఫరా చేస్తున్నారు. గ్యాస్ ఉత్పత్తిఅనంతరం మిగిలిన చెత్తను సేంద్రీయ ఎరువుగా వినియోగిస్తున్నారు.

మొదటిసారి మెహదీపట్నం రైతుబజార్‌లో చెత్తతో సేంద్రీయ ఎరువు తయారీ యూనిట్‌ను 2016లో నెలకొల్పారు. రెండు సంవత్సరాలుగా బాగా పని చేసిన అనంతరం అది కుంటుపడటంతో ఇప్పుడు మళ్ళీ యూనిట్‌ను తెరిపించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. ఎర్రగడ్డ మోడల్ రైతుబజార్‌లో ఇప్పటికే బయోగ్యాస్ ప్లాంట్‌ను ఏర్పాటు చేశారు. కూకట్‌పల్లి రైతుబజార్‌లో బయోగ్యాస్ నడుస్తోంది. తర్వాత దశల వారీగా ఏర్పాటు చేసేందుకు అధికారులు కృషి చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News