హైదరాబాద్: కిరాయి గుండాల మాదిరిగా పోలీసులు దాడి చేశారని టిపిసిసి ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి మండిపడ్డారు. కాంగ్రెస్ వార్ రూమ్ లో డేటాను ధ్వంసం చేశారని, కాంగ్రెస్ నేతలను, కార్యకర్తలను అరెస్ట్ చేశారని, వారిని ఎక్కడికి తీసుకెళ్లారో పోలీసులు చెప్పడం లేదని, వారి కుటుంబాలు ఆందోళన చెందుతున్నాయన్నారు. బిఆర్ఎస్ కార్యాలయం ప్రారంభోత్సవం నాడు కాంగ్రెస్ పార్టీపై దాడి చేస్తారా? అని ప్రశ్నించారు. కాంగ్రెస్ టాస్క్ ఫోర్స్ సభ్యుడైన సునీల్ కనుగోలును అరెస్ట్ చేయాలన్న ఆలోచన ఎందుకు వచ్చిందని అడిగారు. మధ్యాహ్నం 12.30గంటలకు తెలంగాణ భవన్ నుంచి వెళ్లి బిఆర్ఎస్ భవన్ ను ముట్టడిస్తామన్నారు. కాంగ్రెస్ పార్టీ వార్ రూమ్ లో కాంగ్రెస్ వ్యవహారాలు జరుగుతాయని, ఇక్కడ పోలీసుల పెత్తనం ఏంటి అని ప్రశ్నించారు. కాంగ్రెస్ వ్యవహారాల్లో పోలీసులు తల దూరిస్తే చూస్తూ ఊరుకోమని రేవంత్ రెడ్డి హెచ్చరించారు. తెలంగాణ కాంగ్రెస్ వార్ రూమ్ పైన పోలీసుల దాడికి నిరసనగా రేపు హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ వద్ద నిరసన చేపడుతామని హెచ్చరించారు.
కిరాయి గుండాల మాదిరిగా పోలీసుల దాడి: రేవంత్ రెడ్డి
- Advertisement -
- Advertisement -
- Advertisement -