- Advertisement -
మహబూబ్ నగర్: సంక్రాంతికి ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని 9 బస్సు డిపోల నుంచి ఆంధ్రప్రదేశ్ లోని పలు ప్రాంతాలకు ఆర్టిసి అదనంగా బస్సు సర్వీసులను నడిపించనుంది. షాద్ నగర్ నుంచి 63, మహబూబ్ నగర్ 54, వనపర్తి 51, గద్వాల 42, నారాయణపేట 35, కొల్లాపూర్ 32, నాగర్ కర్నూల్ 30, కల్వకుర్తి 27, అచ్చంపేట నుంచి 26 బస్సులు ప్రయాణికులను చేరవేయనున్నాయి. ఈ సర్వీసులు జనవరి 7 నుంచి 15వ తేదీ వరకు కొనసాగుతాయి.
- Advertisement -