హైదరాబాద్ : దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపించే సత్తా ఒక్క బిఆర్‌ఎస్ పార్టీకే ఉందని ఆ పార్టీ లోక్ సభా పక్ష నాయకులు, ఖ మ్మం పార్లమెంట్ సభ్యులు నామా నాగేశ్వరరావు పేర్కొన్నారు. న్యూఢిల్లీలోని సర్దార్ పటేల్ రోడ్‌లో బుధవారం బిఆర్‌ఎస్ పార్టీ జాతీయ కార్యాలయాన్ని సిఎం కెసిఆర్ ప్రాంభించారు. పార్టీ జెండా ఆవిష్కరణ కార్యక్రమంతో పాటు రాజ శ్యామల యాగంలో కూడా ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా నామాగా మాట్లాడుతూ, దేశ రాజకీయా ల్లో బిఆర్‌ఎస్ ప్రత్యామ్నాయ రాజకీయ శక్తి అని అన్నారు. అబ్ కే బార్ కిసాన్ సర్కార్ నినాదంతో బిఆర్‌ఎస్ ముందుకుపోతుందన్నారు. దేశంలో రై తు సంఘాలు, నేతలు, రైతులతో చర్చించి, మెరుగై న దేశాభివృద్ధికి కృషి చేయడం జరుగుతుందన్నా రు. ఢిల్లీలో పార్టీ జాతీయ కార్యాలయం ప్రారంభంతో అద్భుత ఘట్టానికి తెర లేచిందని అన్నారు. కెసిఆర్ నాయకత్వంలో దేశంలో అనూహ్యమైన మార్పు రాబోతోందన్నారు.
కెసిఆర్ మార్క్ , తెలంగాణా మోడల్ అభివృద్ది దేశంలో రావడం తధ్యమన్నారు. ఇది కేవలం ఆయనకే సాధ్యమన్నారు. ఢిల్లీ నడిబొడ్డున పార్టీ జాతీయ కార్యాలయం ఏర్పాటుతో దేశంలో నవ శఖానికి నాంది పలికిన ట్లు అయిందని నామా అన్నారు. ఇక నుంచి బిఆర్‌ఎస్ జాతీయ రాజకీయాల్లో మరింత దూకుడుగా వ్యవహరిస్తుందన్నారు. తెలంగాణా మోడల్ అభివృద్ధికి పెద్ద ఎత్తున ఆకర్షితులవుతున్నారని అన్నా రు. ప్రజా సమస్యలే ఎజెండాగా బిఆర్‌ఎస్ దూసుకుపోతోందని నామ తెలిపారు. తెలంగాణలో అ మలవుతున్న సంక్షేమ పథకాలను దేశ వ్యాప్తంగా అమలు చేయాలన్నదే కెసిఆర్ అభిమాతమని నామా స్పష్టం చేశారు. బిఆర్‌ఎస్‌తో దేశంలో విప్లవాత్మక మార్పులు తధ్యమని ఆయన పేర్కొన్నారు.
నామా నివాసంలో విందు
బిఆర్ ఎస్ పార్టీ జాతీయ కార్యాలయం ప్రారంభోత్సవం సందర్భంగా న్యూఢిల్లీలోని తన నివాసంలో లోక్ సభా పక్ష నేత, ఖమ్మం ఎంపీ నామ నాగేశ్వరరావు పార్టీ నేతలకు పెద్ద ఎత్తున విందు ఏర్పాటు చేశారు. ఈ విందులో 3 వేల మందికి పైగా పాల్గొన్నారు. సిఎం కెసిఆర్‌తో పాటు వివిధ పార్టీలకు చెందిన జాతీయ నాయకులు, రైతు నాయకులు పాల్గొన్నారు.