Monday, December 23, 2024

రేపు ప్రధాని మోడీతో కోమటిరెడ్డి భేటీ

- Advertisement -
- Advertisement -

భువనగిరి:  ఎంపికోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఈ నెల 16న ప్రధాని నరేంద్ర మోడీతో భేటీ కానున్నారు. తన పార్లమెంట్ నియోజకవర్గంలో అభివృద్ది పనుల విషయమై చర్చించనున్నారు.మూసీ నదీ ప్రక్షాళనతో పాటు విజయవాడ-హైద్రాబాద్ జాతీయ రహదారి విస్తరణ పనుల విషయమై కూడా ప్రధానితో చర్చించనున్నారు. ఎంఎంటీసీ, మెట్రో రైలు పనులపై కూడా చర్చించనున్నారు. ఎఐసిసి చీఫ్ మల్లికార్జున ఖర్గేతో కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి బుధవారం న్యూఢిల్లీలో సమావేశమయ్యారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితిపై చర్చిం చారు. మరోవైపు రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులపై కూడా కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి చర్చించారు. ఎన్నికలకు నెల రోజుల ముందే తాను రాజకీయాల గురించి మాట్లాడుతానని మూడు రోజుల క్రితం ప్రకటించారు. తాను ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో ఉన్నట్టుగా చెప్పారు.
ఈ ఏడాది ఆగస్టు 4వ తేదీన కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సోదరుడు రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. తన సోదరుడు కాంగ్రెస్ పార్టీని వీడినా తాను మాత్రం కాంగ్రెస్ పార్టీలోనే ఉంటానని ప్రకటించారు. ఇటీవల జరిగిన మునుగోడు అసెంబ్లీ స్థానానికి జరిగిన ఉప ఎన్నికల్లో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బిజెపి అభ్యర్ధిగా పోటీ చేసి ఓటమి పాలయ్యాడు. ఈ ఎన్నికల్లో రాజగోపాల్ రెడ్డికి ఓటేయాలని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మాట్లాడినట్టుగా ఉన్న ఆడియో సంభాషణ వైరల్ గా మారింది. మునుగోడు ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరపు ప్రచారానికి వెళ్లలేదు. ఎన్నికలు జరిగే సమయంలో అస్ట్రేలియా పర్యటనకు వెళ్లారు. ఈ సమయంలో ఆయన చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి. మునుగోడులో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించదని చెప్పారు. ఈ వ్యాఖ్యలపై ఆయనకు కాంగ్రెస్ పార్టీ క్రమశిక్షణ సంఘం షోకాజ్ నోటీసులు జారీ చేసింది. ఈ నోటీసుకు సమాధానం ఇచ్చారు. ఈ పరిణామాలతో కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాలకు ఆయన దూరంగా ఉంటున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News