హైదరాబాద్ : భారతీ ఎయిర్‌టెల్ 5జి సేవలను నగరంలో ప్రారంభించినట్లు వెల్లడించింది. తొలుత ఈ సేవలను నగరంలోని కీలకప్రాంతాలతో పాటుగా మెట్రో రైల్, రైల్వే స్టేషన్స్, బస్ టర్మినల్ వంటి రవాణా కేంద్రాలలో ఈ సేవలు అందుబాటులోకి తీసుకువచ్చారు. నగర ప్రజలు ఇప్పుడు అల్ట్రా ఫాస్ట్ 5జి కనెక్టివిటీని హైదరాబాద్ మెట్రో రైల్‌లో ప్రయాణ సమయంలో కూడా ఆస్వాదించవచ్చు.
ఎయిర్‌టెల్ 5జి సేవలను ప్రయాణీకులు ఇప్పుడు సికింద్రాబాద్, కాచిగూడా రైల్వే స్టేషన్‌లతో పాటుగా ఇంటర్ స్టేట్ బస్ టర్మినల్ (ఐఎస్‌బిటి) ఇమ్లీబన్ బస్ డిపో వద్ద పొందవచ్చు. ఎయిర్‌టెల్ 5జీ ప్లస్‌ను నగరంలో బేగంపేట, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, హైటెక్ సిటీ, గచ్చిబౌలి, బోయినపల్లి, కొంపల్లి, ఆర్‌టీసీ క్రాస్ రోడ్స్, కోఠి, మలక్‌పేట, చార్మినార్, హబ్సిగూడా, ఉప్పల్,నాగోల్, కూకట్‌పల్లి, మియాపూర్ మొదలైన చోట్ల ఆస్వాదించవచ్చు, ఎయిర్‌టెల్ తమ నెట్‌వర్క్‌ను మరింతగా విస్తరించడానికి కృషి చేస్తోంది. త్వరలోనే నగర వ్యాప్తంగా ఈ సేవలను విస్తరించనుంది.