- Advertisement -
ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు శుక్రవారం నష్టాల్లోనే ముగిశాయి. ఇది వరుసగా రెండో నష్టాల్లోనే ముగిసింది. అంతర్జాతీయ మార్కెట్ ప్రతికూల సంకేతాలు మార్కెట్‌పై ప్రభావం చూపింది. సెన్సెక్స్ 461.22 పాయింట్లు లేక 0.75 శాతం క్షీణించి 61337.81 వద్ద, నిఫ్టీ 145.90 పాయింట్లు లేక 0.79 శాతం నష్టపోయి 18269 వద్ద ముగిసింది. నిఫ్టీ 50లో టాటామోటార్స్, హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్, హిందుస్థాన్ యూనిలీవర్, టాటా స్టీల్ షేర్లు ప్రధానంగా లాభపడగా, డాక్టర్ రెడ్డీస్, ఎం అండ్ ఎం, అదానీ పోర్ట్ సెజ్, ఏషియన్ పెయింట్స్ ప్రధానంగా నష్టపోయాయి. కాగా యస్ బ్యాంక్ 6 శాతం, యుబిఐ 5 శాతం నష్టపోయాయి. డాలరుతో పోల్చినప్పుడు రూపాయి విలువ 0.10 పైసలు పెరిగి 82.86 వద్ద ముగిసింది. బంగారం 86.00 లేక 0.16 శాతం పెరిగి రూ. 54193.00 వద్ద ట్రేడయింది.
- Advertisement -