Saturday, December 21, 2024

వికారాబాద్‌లో సైకో వీరంగం

- Advertisement -
- Advertisement -

వికారాబాద్ : ఓ సైకో వికారాబాద్ పట్టణంలోని వెంకటేశ్వర కాలనీలో శుక్రవారం సాయంత్రం హల్‌చల్ చేశాడు. అడ్డం వచ్చిన వారి పై కారణం లేకుండానే ఇనుప రాడ్డు, తాపీ, రాళ్లతో దాడి చేయడం వలన కాలనీ వాసులు భయాందోళనకు గురయ్యారు. సైకో దాడిలో 10 మందికి గాయాలు అయ్యాయి. దీంతో స్థానికులు ఆ సైకోను పట్టుకొని తాళ్లతో కాళ్లు, చేతులు కట్టేసి దేహాశుద్ది చేశారు. అనంతరం పోలీసులకు అప్పగించారు. సైకో వీరంగంతో వెంకటేశ్వర కలనీ వాసులు భయంతో ఇండ్లల్లోకి పరుగులు తీశారు. స్థానికుల సమాచారం మేరకు ఘటన స్థలికి చేరుకున్న పోలీసులు సైకోను అదుపులోకి తీసుకొని విచారణ చేయగా కలకత్తా నుండి వచ్చినట్లు, హిందీలో సమాధానం ఇచ్చాడని వికారాబాద్ పట్టణ సిఐ టంగుటూరి శ్రీను తెలిపారు.ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News