Monday, January 20, 2025

నేడు తెలంగాణ ఎనర్జీ కన్జర్‌వేషన్ అవార్డుల ప్రదానం

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : 2022 ఏడాదికి గాను తెలంగాణ స్టేట్ ఎనర్జీ కన్జర్‌వేషన్ అవార్డులను శనివారం నాడు రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి ప్రదానం చేయనున్నారు. బిల్డింగ్ కేటగిరి, రవాణా, యూఎల్‌బి కేటగిరిలతో పాటు చిన్న, మధ్య తరహా, పెద్ద ఎనర్జీ కన్జుమర్స్ వినియోగదారుల కోసం ఇప్పటికే పలు మార్గదర్శకాలను తెలంగాణ రాష్ట్ర పునరుద్ధరణీయ ఇంధన వనరుల అభివృద్ధి సంస్థ జారీ చేసిన విషయం తెలిసిందే.

ఇందులో భాగంగా డిసెంబర్ 9వ తేదీ వరకు దరఖాస్తులను స్వీకరించి వారిని స్క్రూటినీ చేసి ఈ అవార్డులకు ఎంపిక చేసింది. శనివారం నాడు ఈ మేరకు ఖైరతాబాద్‌లోని విశ్వేశ్వరయ్య భవన్‌లో జరిగే కార్యక్రమంలో మంత్రి జగదీశ్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై విజేతలకు బహుమతులను అందజేయనున్నారు. కాగా కిందటి సారి 2018 ఏడాదితో పాటు 2019 అలాగే 2020 ఏడాదిలోనూ తెలంగాణ ఎనర్జీ
కన్జర్‌వేషన్ అవార్డులను అందజేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News