Monday, December 23, 2024

సౌత్‌లోనే టాప్

- Advertisement -
- Advertisement -

అందాల తార కాజల్ అగర్వాల్‌కు పెళ్లయి తల్లి కూడా అయినప్పటికీ ఇప్పటికీ ఆమెకు ప్రేక్షకుల్లో క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. 2022లో గూగుల్ సెర్చ్‌లో టాప్ 10లో ఉన్న సౌత్ కథానాయికల జాబితా వచ్చింది. ఈ లిస్ట్‌లో కాజల్ అగర్వాల్ టాప్‌లో ఉండడం విశేషం. కొన్ని సంవత్సరాల పాటు స్టార్ హీరోలతో సినిమాలు చేస్తూ స్టార్ హీరోయిన్‌గా కొనసాగిన ఈ బ్యూటీ ఈ ఏడాది తాను ప్రేమించిన బిజినెస్ మేన్ గౌతమ్ కిచ్లుని పెళ్లాడి పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. అయినప్పటికీ ఈ బ్యూటీ పాపులారిటీ ఇప్పటికీ అదేవిధంగా ఉంది. గూగుల్ సెర్చ్‌లో ఎక్కువ మంది కాజల్ అగర్వాల్ ఫొటోలు చూశారట. ఇక కాజల్ అగర్వాత టాప్ 10 లిస్ట్‌లో వరుసగా స్టార్ బ్యూటీలు సమంత-, రష్మిక, – తమన్నా,- నయనతార-, అనుష్క-, పూజాహెగ్డే,- కీర్తిసురేష్, – సాయిపల్లవి-, రకుల్ ప్రీత్ సింగ్ నిలిచారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News