Friday, December 20, 2024

కృష్ణా నదిలో 5గురు విద్యార్థులు గల్లంతు

- Advertisement -
- Advertisement -

విజయవాడ:ః విజయవాడ నగరానికి సమీపాన్న యనమలకుదురులో కృష్ణా నదిలో స్నానానికి వెళ్ళిన ఐదుగురు విద్యార్థులు గల్లంతు అయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు, రెస్కూ టీం ఘటనా స్థలానికి చేరుకుని ముమ్మరంగా గాలిస్తున్నారు. గల్లంతైన వారంతా కృష్ణా నదిలో ఈత కొట్టడానికి వెళ్ళినట్లు తెలుస్తోంది. వారిలో ఒకరి మృతదేహాన్ని గుర్తించారు. మరో నలుగురి ఆచూకీ తెలియాల్సివుంది. విషయం తెలుసుకున్న స్థానిక ఎంఎల్‌ఎ గద్దె రామ్మోహన్ ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు.

తొలుత ఒక విద్యార్థి నీటిలో మునిగిపోతున్న క్రమంలో ఒడ్డున ఉన్న మరో నలుగురు విద్యార్థులు అతన్ని కాపాడేందుకు వెళ్ళి నీట మునిగారని ప్రత్యేక్ష సాక్షి ఒకరు చెప్పారు. బాధితులంతా విజయవాడ పడమట ప్రాంతానికి చెందిన వారిగా గుర్తించారు. విద్యార్థులు గల్లంతవ్వడంతో వారి కుటుంబ సభ్యులు, బంధువులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News