Saturday, December 21, 2024

ఎమ్మెల్సీ కవితకు ఇండియన్ లైబ్రరీ కాంగ్రెస్ ఆహ్వానం

- Advertisement -
- Advertisement -

జనవరి 2, 3న కేరళలో పర్యటించనున్న కవిత

ఇండియన్ లైబ్రరీ కాంగ్రెస్ కు హాజరుకానున్న ఎమ్మెల్సీ కవిత

 

హైదరాబాద్: జనవరి 2, 3వ తేదీల్లో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కేరళలో పర్యటించనున్నారు. కేరళలోని కన్నూరులో జరిగే ఇండియన్ లైబ్రరీ కాంగ్రెస్ లో పాల్గొననున్నారు. ఈ మేరకు ఇండియన్ లైబ్రరీ కాంగ్రెస్ ప్రతినిధులు కల్వకుంట్ల కవితకు ఆహ్వానం పలికారు. 2వ తేదీ సాయంత్రం జరగనున్న సాంస్కృతిక ఉత్సవాలకు కవిత ముఖ్య అతిథిగా హాజరవుతారు.3వ తేదీన సంస్కృతి పై జరిగే చర్చలో పాల్గొంటారు. ఇండియన్ లైబ్రరీ కాంగ్రెస్ సమావేశాలను కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ ప్రారంభిస్తారు. ఈ కార్యక్రమంలో దేశవ్యాప్తంగా పలువురు ప్రముఖులు హాజరవుతారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News