Friday, December 20, 2024

కలుగులో అమ్మాయిలు.. పట్టేసిన పోలీసులు

- Advertisement -
- Advertisement -

ముంబై: ముంబైలోని దహిసర్ ప్రాంతంలోని ఒక బార్ అండ్ రెస్టారెంట్‌పై పోలీసులు దాడి జరిపి అందులో ఏర్పాటు చేసిన ఒక రహస్య ప్రదేశంలో దాచిన 17 మంది యువతులను కాపాడారు. శుక్రవారం రాత్రి బార్ అండ్ రెస్టారెంట్‌పై పోలీసులు దాడి చేసి కస్టమర్లు, బార్ సిబ్బంది, మేనేజర్‌తోసహా 19 మందిని అరెస్టు చేసినట్లు దహిసర్ పోలీసు స్టేషన్ అధికారి ఒకరు శనివారం తెలిపారు.

డ్యాన్స్ ఫ్లోర్ కింద ఏర్పాటు చేసిన రహస్య గదిలో 17 మంది యువతులు ఉన్న విషయాన్ని గుర్తించి వారిని కాపాడినట్లు ఆ అధికారి చెప్పారు. దాడి జరిగినపుడు పోలీసుల కళ్లు కప్పేందుకు ఇటువంటి రహస్య గదులను ఏర్పాటు చేస్తుంటారని ఆయన అన్నారు. ఆ యువతులు తమ ఇళ్లకు వెళ్లేందుకు అనుమతించినట్లు ఆయన తెలిపారు. నేలమాళిగలో దాచి వారి ప్రాణాలకు హాని కలిగించేందుకు ప్రయత్నించిన నేరానికి పాల్పడ్డారని ఆరోపిస్తూ ఐపిసిలోని సెక్షన్ 308 కింద బార్ ఓనర్‌పై కేసు నమోదు చేసినట్లు అధికారి చెప్పారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News