Monday, December 23, 2024

ఆరుగురి సజీవ దహనం

- Advertisement -
- Advertisement -

కాసిపేట: మంచిర్యాల జిల్లాలో ఘోర అగ్నిప్రమాదం సం భవించింది. ప్రమాదంలో ఆరుగురు సజీవ దహనమయ్యారు. మందమర్రి మండలం గుడిపెల్లి గ్రామంలో శుక్రవారం అర్ధరాత్రి మాసు శివయ్య అనే వ్యక్తి ఇల్లు దగ్ధం అయింది. క్రమంగా ఇంటి మొత్తానికి మంటలు వ్యాపించడంతో కుటుంబ సభ్యులతోపాటు మరో వ్యక్తి మృత్యువాత పడ్డా డు. ఈ ఘటన పట్ల పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇది అగ్ని ప్రమాదమా.. హత్యాయత్నమా చర్చ జరుగుతోంది. మందమర్రి మండలం రామకృష్ణాపూర్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని గుడిపేట గ్రామంలో జరిగిన అ గ్నిప్రమాదంలో మాసు శివయ్య(5౦) అతని భా ర్య రాజ్యలక్ష్మీ(పద్మ)(45), సింగరేణి కార్మికు డు శనిగారపు శాంతయ్య(52), పద్మ అక్క కు మార్తె గడ్డం మౌనిక(4౦), మౌనిక పెద్ద కుమార్తె హిమబిందు(4), ఏడాది వయస్సున్న రెండో కు మార్తె స్వీటి అగ్నికి ఆహుతయ్యారు. పోలీసులు, గ్రామస్థులు తెలిపిన వివరాల ప్రకారం.. శ్రీరాంపూర్‌కు చెందిన సింగరేణి కార్మికుడు శాంత య్య, శివయ్య భార్య పద్మతో సహజీవనం చేస్తున్నాడు.

శుక్రవారం శివయ్య, పద్మ, శాంతయ్యతో కోటపల్లి మండలం కొండంపల్లికి చెం దిన పద్మ అక్క కూతురు మౌనిక, ఆమె కుమార్తె లు హిమబిందు, స్వీటీతో కలిసి విందు కార్యక్ర మం నిమిత్తం గుడిపేటకు వచ్చి అంతా కలసి శి వయ్య ఇంట్లో నిద్రించారు. కాగా, శుక్రవారం అర్ధరాత్రి ఒక్కసారిగా మంటలు చెలరేగి శివయ్య పెంకుటిల్లు అంటుకోగా ఇల్లు పూర్తిగా కాలిపోయింది. మంటల్లోనే ఆరుగురు సజీవ దహనం అయ్యారు. వారి మృతదేహాలు గుర్తుపట్టలేని వి ధంగా మారిపోయాయి. గుడిపేట గ్రామంలో ఇండ్ల మధ్యనే శివయ్య ఇల్లు ఉన్నప్పటికి మంట లు అంటుకున్న సమయంలో వారి ఆర్తనాదాలు ఎవరికీ విన్పించకపోవడం రేకెత్తిస్తోంది. మంటల ఎగిసిపడుతున్న సమయంలో చూశామని కొందరు గ్రామస్తులు పేర్కొన్నారు. ఫైరింజన్, పోలీసులు సంఘటన స్థలాని కి చేరుకొని మంటలను ఆర్పేందుకు ప్రయత్నించారు.
గుడిపేట గ్రామంలో శివయ్య భార్య పద్మతో సిం గరేణి కార్మికుడు శాంతయ్యకు మధ్య ఉన్న సం బంధం సంఘటనకు కారణమనే సందేహాలు వ్య క్తమవుతున్నాయని పోలీసులు అంటున్నారు.

శాంతయ్య జీతం డబ్బులు పద్మకు ఇస్తున్నాడని, ఇటీవల శాంతయ్య కూమారుడు గొడవ పడిన ట్లు గ్రామస్తులు పేర్కొన్నారు. ఆ కోణంలో కూడా పోలీసులు విచారణ చేపట్టారు. ఇంటికి సమీపంలోనే 15 లీటర్ల సామర్థం గల రెండు పెట్రోల్ డబ్బాలు లభ్యమయ్యాయి. ఒక డబ్బాలో మొత్తం పెట్రోలు ఖాళీ అవ్వగా, మరో డబ్బాలో పెట్రోల్ నిండుగా ఉంది. సమీపంలో ఒక ఆటో ఉండగా అక్కడ ఆటో సీట్లపై కారం పొడి చల్లి ఉండడం కూడా అనూమానాలను రేకెత్తిస్తున్నాయి. ఎవరైన శివయ్య ఇంటిపై పెట్రోల్ చల్లి నిప్పు పెట్టారా అనే అనూమానాలు వినవస్తున్నాయి.
శాంతయ్య కుటుంబ సభ్యులే కారకులా…?
గుడిపేట గ్రామంలో సజీవదహనంలో ఆరుగురు మృతి చెందగా సంఘటనకు శాంతయ్య కుటుంబం సభ్యులే కారణామా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయని పోలీసులు తెలిపారు. శాంతయ్య భార్య, పిల్లలను వదిలి గుడిపేటలో శివయ్య ఇంటిలోనే ఉంటుండగా సంఘటనపై అనూమానాలు రేకెత్తుతున్నాయని, ఘటన స్థలం నుంచి డాగ్ స్కాడ్ గుడిపేట గ్రామ శివారు దాటి జైపూర్ మండలం కాన్కూర్ వరకు వెళ్లి ఆగిపోయాయని తెలియజేశారు.
16 బృందాలతో విచారణ: డిసిపి అఖిల్ మహాజన్
అగ్ని ప్రమాదంలో ఆరుగురు సజీవ దహనం సంఘటనపై అనూమానాలు వెల్లు వెత్తుతున్న నేపథ్యంలో16 బృందాలను ఏర్పాటు చేసి విచారణ చేపట్టినట్లు మంచిర్యాల డిసిపి అఖిల్ మహాజన్ సంఘటన స్థలంలో తెలిపారు. ఇక్కడ ప్రతి ఘటనపై క్షుణ్ణంగా పరిశీలించడం జరుగుతుందని కేసును త్వరలోనే ఛేదిస్తామని ఆయన తెలిపారు.
తరువాయి 12లో

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News