- Advertisement -
అవతార్ 2 సినిమా చూస్తూ ఆంధ్రప్రదేశ్‌కు చెందిన లక్ష్మీరెడ్డి శ్రీను(37) అనే ప్రేక్షకుడు మరణించాడు. కాకినాడ జిల్లా పెద్దాపురం పట్టణంలో ఈ ఘటన జరిగింది. శనివారం లక్ష్మీరెడ్డి శ్రీను, ఆయన సోదరుడు రాజు కలిసి అవతార్ 2 సినిమా చూడటానికి పెద్దాపురంలోని ఓ థియేటర్‌కు వెళ్ళారు. సినిమా చూస్తున్న మధ్యలోనే లక్ష్మీరెడ్డి శ్రీనుకు గుండెపోటు వచ్చి కుప్పకూలిపోయాడు. వెంటనే లక్ష్మీరెడ్డి శ్రీనును దగ్గరలోని ప్రభుత్వ ఆసుపత్రికి సోదరుడు రాజు తీసుకెళ్ళాడు. కానీ అప్పటికే లక్ష్మీరెడ్డి శ్రీను మరణించినట్లు వైద్యులు ధృవీకరించారు. మృతుడు లక్ష్మీరెడ్డి శ్రీనుకు ఒక కుమార్తె, కుమారుడు ఉన్నారు.
- Advertisement -