- Advertisement -
హైదరాబాద్: హైదరాబాద్ ఉస్మానియా యూనివర్సిటీలో నిర్వహించిన ‘నార్కోటిక్స్ ఫ్రీ క్యాంపస్’ కార్యక్రమం లో సిపి ఆనంద్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. స్కూళ్లు, కాలేజీల్లో చదువుకుంటున్న అమ్మాయిల మీద జరుగుతున్న అఘాయిత్యాలపై త్వరలోనే ప్రత్యేక చట్టం వస్తుందని, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం త్వరలోనే ఈ ప్రత్యేక చట్టాన్ని తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తోందని ప్రకటించారు. పాఠశాలలు, కళాశాలల్లో చదువుకునే విద్యార్థినులు ఎన్నో వేధింపులకు గురవుతున్నారని, చదువు చెప్పాల్సిన ఉపాధ్యాయులే కీచకులుగా మారుతున్న ఘటనలు తరచూ వెలుగులోకి వస్తున్నాయని సిపి ఆనంద్ అన్నారు.ఇలాంటి ఘటనలతో స్యూళ్లకు, కాలేజీలకు అమ్మాయిలను పంపించాలంటే తల్లిందండ్రులు భయపడుతున్నారని, అయితే అలాంటి ఘటనలు జరగకుండా తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక చట్టాన్ని తీసుకొచ్చేందుకు సిద్దంగా ఉందని ఆయన అన్నారు.
- Advertisement -