- Advertisement -
కోల్‌కతా: దేశ సరిహద్దు ప్రాంతాల భద్రతలో బీఎస్‌ఎఫ్(సరిహద్దు భద్రతా దళాలు ) తోపాటు రాష్ట్రాలు కూడా బాధ్యతలు పంచుకోవాలని కేంద్ర హోంమంత్రి అమిత్‌షా 25వ తూర్పుజోన్ కౌన్సిల్ (ఇజెడ్‌సి) సమావేశంలో ముఖ్యమంత్రులకు సూచించారు. భారత్ బంగ్లా బలహీన సరిహద్దులో అక్రమ చొరబాటు, సరిహద్దుల మీదుగా స్మగ్లింగ్ తదితర సమస్యలపై సమావేశంలో చర్చించారు.
పశ్చిమబెంగాల్ సెక్రటేరియట్ వద్ద జరిగిన ఈ సమావేశానికి షా అధ్యక్షత వహించారు. రాష్ట్రాల మధ్య రవాణా సౌకర్యాలు, నీటి పంపకాలు కూడా చర్చకు వచ్చాయి. ముఖ్యమంత్రి మమతాబెనర్జీ, ఝార్ఖండ్ సిఎం హేమంత సోరెన్, బీహార్ డిప్యూటీ సిఎం తేజస్వీయాదవ్, ఒడిశా మంత్రి ప్రదీప్ అమత్ తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.
- Advertisement -