Monday, December 23, 2024

భారత్‌కు అణు బూచీ చూపుతున్న షాజియా మర్రీ (వీడియో)

- Advertisement -
- Advertisement -

ఇస్లామాబాద్: ప్రధాని నరేంద్ర మోడీపై పాకిస్థాన్ విదేశాంగ మంత్రి బిలావల్ భుట్టో ఇటీవల వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన విషయంలో తెలిసిందే. అది ఇంకా సద్దుమణగక ముందే పాకిస్థాన్ పీపుల్స్ పార్టీ నేత, పాక్ మంత్రి షాజియా మర్రీ భారత్‌కు తమ అణు బాంబు బూచీ చూపి భయపెట్టే ప్రయత్నం చేశారు. అంతేకాక ఆమె బిలావల్ భుట్టోకు వత్తాసు పలికారు. ఆమె ‘పాకిస్థాన్ ఓ అణ్వస్త దేశం అన్నది భారత్ మరచిపోకూడదు’అని హెచ్చరించినట్లు ఓ వార్తా సంస్థ(బోల్ న్యూస్) పేర్కొంది. అవసరమైతే భారత్‌పై అణ్వస్త్రాన్ని ప్రయోగించడానికి కూడా వెనుకాడబోమని షాజియా మర్రీ హెచ్చరించినట్లు తెలుస్తోంది.

ఆమె తన వ్యాఖ్యలను సమర్థించుకుంటూ ఆదివారం ఓ ట్వీట్ కూడా చేశారు. పైగా పాకిస్థాన్ ఓ బాధ్యతాయుతమైన దేశం అని పేర్కొన్నారు. ఒకవిధంగా ఆమె భారత్‌ను తమ దేశానికి అణ్వస్త్రం శక్తి ఉందని బెదిరించారనే భావించాలి. ‘ మా అణ్వస్త్ర హోదా మౌనంగా ఉండేందుకు ఉద్దేశించింది కాదు. అవసరమైతే ప్రయోగించడానికి వెనుకాడబోము’ అని భారత్‌ను హెచ్చరించారు. ఆమె ఇంకా “మీరు పాకిస్థాన్‌పై పదేపదే ఆరోపణలు చేస్తూ ఉంటే పాకిస్థాన్ చూస్తూ ఊరుకోదు” అన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News