Monday, December 23, 2024

సమైక్య రాష్ట్రంలో విశ్వవిద్యాలయాల్లో అరకొర వసతులు

- Advertisement -
- Advertisement -

సమైక్య రాష్ట్రంలో విశ్వవిద్యాలయాల్లో అరకొర వసతులతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారని రాష్ట్ర ఎక్సైజ్, క్రీడలు, యువజన, పర్యాటక, సాంసృతిక, పురావస్తు శాఖ మంత్రి డాక్టర్ వి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. అప్పటి పాలకులు మన విశ్వవిద్యాలయాల పట్ల పూర్తి నిర్లక్ష్య వైఖరి ప్రదర్శించారని గుర్తు చేశారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాతే పీయూలో సకల వసతులు కల్పించామని తెలిపారు.

పాలమూరు విశ్వవిద్యాలయంలో ఎగ్జామినేషన్ బ్రాంచ్ నుంచి పి.యు గెస్ట్ హౌస్ వరకు రూ. 90 లక్షలతో నిర్మించనున్న సిసి రోడ్డు పనులకు, రూ.70 లక్షల నిధుల వ్యయంతో యూనివర్సిటీ క్యాంటీన్ నిర్మాణ పనులకు మంత్రి భూమి పూజ చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడారు… త్వరలో పీయూలో ఇంజనీరింగ్, లా కోర్సులతో పాటు మరిన్ని నూతన కోర్సులను ప్రవేశ పెట్టేందుకు కృషి చేస్తామన్నారు. విశ్వవిద్యాలయంలో రూ. 50 కోట్లతో వివిధ అభివృద్ధి పనులు చేపట్టామని, ప్రస్తుతం వివిధ దశలో ఉన్న అభివృద్ధి పనులన్నింటినీ రాబోయే 6 నెలల్లో పూర్తి చేస్తామని, భవిష్యత్తులో భారీగా నిధులు తీసుకొచ్చి యూనివర్సిటీని నెంబర్ వన్ గా తీర్చిదిద్దుతామన్నారు. జిల్లాలో విద్య, ఉపాధి అవకాశాలు భారీగా పెంచుతామన్నారు.

బండమీద పల్లి కాదు బంగారుపల్లి…

బండమీద పల్లిని బంగారుపల్లిగా మారుస్తామని మంత్రి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. పీయూ సమీపంలోనే నూతన కోర్టు కాంప్లెక్స్ ఏర్పాటు చేస్తున్నామని, బండమీదపల్లి మీదుగానే కోస్గి బైపాస్ రోడ్డు పనులు త్వరలోనే ప్రారంభం అవుతాయని, దాంతో అటు హన్వాడ ఫుడ్ పార్క్, ఇటు ఐటీ పార్కుకు బండమీదపల్లి సెంటర్ పాయింట్ అవుతుందని అన్నారు. ఈ రెండు చోట్లకు ఇక్కడి నుంచి కేవలం 10 నిమిషాల్లో చేరుకోవచ్చని తెలిపారు. అమర రాజా బ్యాటరీ పరిశ్రమ ఏర్పాటు ద్వారా 10 వేల మందికి ప్రత్యక్షంగా, వేలాది మందికి పరోక్షంగా ఉపాధి అవకాశాలు లభిస్తాయని అన్నారు.

కొందరు దుర్మార్గులు యువతను కులం, మతం పేరిట తప్పుదారి పట్టిస్తున్నారని మంత్రి వాపోయారు. పక్కనే ఉన్న కర్ణాటక, మహారాష్ట్రలను మన రాష్ట్రంతో పోల్చి చూస్తే మనం చేసిన అభివృద్ధి ఏమిటో తెలుస్తుందన్నారు. యువత ఈ విషయాన్ని గమనించాలన్నారు. అడిషనల్ కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్, పి.యు వి.సి లక్ష్మీకాంత్ రాథోడ్, రిజిస్టార్ గిరిజ మంగతాయారు, స్థానిక కౌన్సిలర్ లక్ష్మీ యాదగిరి గౌడ్, ప్రిన్సిపల్ కిషోర్, వైస్ ప్రిన్సిపాల్ కృష్ణయ్య, అధ్యాపకులు పిండి పవన్ కుమార్, మధుసూదన్ రెడ్డి, రాజ్ కుమార్, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News