Friday, December 20, 2024

మేనత్తను చంపి 10 ముక్కలు చేసి పారేశాడు

- Advertisement -
- Advertisement -

జైపూర్ : ఢిల్లీలో శ్రద్ధావాకర్ అనే యువతిని హత్యచేసి 35 ముక్కలుగా నరికి పారేసిన సంఘటన మరువక ముందే రాజస్థాన్ రాజధాని జైపూర్‌లో అలాంటి ఘటనే చోటుచేసుకుంది. అనూజ్‌శర్మ అలియాస్ గోవింద్ దాస్ అనే 32 ఏళ్ల యువకుడు తన మేనత్తను సుత్తితో కొట్టి చంపి, మృతదేహాన్ని 10 ముక్కలు చేసి అడవిలో వేర్వేరు చోట్ల పారేశాడు. అనూజ్‌శర్మ తన మేనత్త సరోజ్‌శర్మ (64)తోపాటు జైపూర్‌లో నివాసం ఉంటున్నాడు. సరోజ్‌భర్త చనిపోయినప్పటి నుంచి ఆమె బాగోగులు అనూజ్ చూసుకుంటున్నాడు. అయితే ఆమె తన విషయాల్లో జోక్యం చేసుకుంటుండటం అనూజ్‌కి నచ్చలేదు.

ఈనెల 11న అనూజ్ ఢిల్లీ వెళ్లవలసి ఉండగా, అందుకు సరోజ్ శర్మ నిరాకరించింది. దీంతో కోపోద్రిక్తుడైన అనూజ్ ఆమెను దారుణంగా హత్య చేశాడు. హార్డ్‌వేర్ షాపు నుంచి మార్బుల్ కటింగ్ మెషిన్ తెచ్చి శవాన్ని పది ముక్కలు చేశాడు. వాటిని సూట్‌కేసులో పెట్టి ఢిల్లీ వెళ్లే నేషనల్ హైవే పక్కన అడవిలో వేర్వేరు చోట్ల పడేశాడు. తనపై ఎవరికీ అనుమానం రాకూడదన్న ప్లాన్‌తో తన మేనత్త కనిపించడం లేదని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. సరోజ్‌శర్మకు ఇద్దరు కుమార్తెలు, కొడుకు ఉన్నారు. కొడుకు విదేశాల్లో ఉంటున్నాడు. అనూజ్ కిచెన్‌లో రక్తపు మరకలు శుభ్రం చేస్తూ సరోజ్ కుమార్తెకు దొరికి పోయాడు. ఆమె పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అసలు దారుణం వెలుగు లోకి వచ్చింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News