హైదరాబాద్: ఇష్టం 2001 లో విడుదలైన తెలుగు సినిమా. ప్రముఖ నటి శ్రియా సరన్ ఈ చిత్రం ద్వారా తెలుగు సినీరంగంలో ప్రవేశించింది. ఇష్టం సినిమాతో సినీ ఇండస్ట్రీకి వచ్చిన శ్రియ రెండు దశాబ్ధాలైనా వరుస అవకాశలతో దూసుకెళ్తోంది. తాజాగా దృశ్యం 2 సినిమాతో బాలీవుడ్ లో సక్సెస్ అందుకుంది. ఆ సినిమా సక్సెస్ మీట్ లో ఆసక్తికర విషయాలను ఆమె పంచుకుంది. ప్రెగెన్సీ సమయంలో అమ్మాయిలు లావు అవ్వడం సహజమే.. కానీ హీరోయిన్ల విషయంలో జనాలు అలా చూడలేరని , ఫ్యాన్స్, మీడియాకు తెలిస్తే తన బాడీ షేప్ పై ట్రోల్స్ చేస్తారేమోనని, అలాగే పుట్టబోయే బిడ్డపై దష్టి పెడతారేమోనని భయపడినట్లు ఆమె అన్నారు.
ప్రెగెన్సీ సమయంలో ఎక్కువ ఒత్తిడికి గురికావద్దు అని పూర్తిగా అమ్మతనాన్ని ఆస్వాదించాలనే ఈ విషయాన్ని దాచిపెట్టినట్లు ఆమె అన్నారు.ప్రెగెన్సీ సమయానికి తన చేతిలో మూడు ప్రాజెక్టులు ఉండటంతో ఎవరికీ చెప్పకుండా షూటింగ్స్ లో పాల్గొన్ననని ఆమె అన్నారు.కాస్త లావు కావడంతో పాటు నెలలు నిండుతున్న కొద్ది సినిమాలకు దూరంగా ఉండి పోయానని ఆమె తెలిపారు.