Friday, December 20, 2024

బాసర ట్రిపుల్ ఐటి విద్యార్థి ఆత్మహత్య .. ఎబివిపి ఆందోళన

- Advertisement -
- Advertisement -

నిర్మల్ ప్రభుత్వ ఆసుపత్రి వద్ద ఎబివిపి నాయకులు ఆందోళన చేపట్టారు. నిన్న బాసర ట్రిపుల్ ఐటిలో విద్యార్థి ఆత్మహత్య చేసుకోవడంతో విద్యార్థి సంఘాలు ఆందోళన చేపట్టాయి. విద్యార్థి కుటుంబానికి న్యాయం చేయాలని ఏబివిపి నాయకులు డిమాండ్ చేశారు.ప్రభుత్వ ఆసుపత్రి లోపలికి వెళ్ళాలని ప్రయత్నించిన ఎబివిపి నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకుని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ట్రిపుల్ ఐటిలో పీయూసి 2 చదువుతున్న విద్యార్థి భానుప్రసాద్ రాసిన సుసైడ్ నోట్ లభించిందని పోలీసులు తెలిపారు. సుసైడ్ నోట్‌లో తన చావుకు ఎవరు కారణం కాదని, జీవితం మీద విరక్తి చెంది చనిపోతున్నట్టు సుసైడ్ నోట్ రాసాడని పోలీసులు తెలిపారు.

రంగారెడ్డి జిల్లా మంచల్ మండలం రంగాపూర్ గ్రామానికి చెందిన భానుప్రసాద్ (18) ఆర్జీయూకేటీలో పీయూసీ-2 చదువుతున్నాడు. కాలేజీ క్యాంపస్‌లో నిరుపయోగంగా ఉన్న హాస్టల్ గదిలో ఫ్యాన్ కు భానుప్రసాద్  ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడిన విషయం తెలిసిందే.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News