వాకర్స్ క్లబ్ ఎన్నికల్లో తెర వెనుక
రాజకీయాలు
ఎస్వీకే అడ్డాలో పాగా కోసం పార్టీల దృష్టి
మన తెలంగాణ/ముషీరాబాద్ : బాగ్‌లింగంపల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రం రాజకీయ పార్టీలకు, ప్రజా సంఘాలకు ఓ ప్రధాన వేదిక. రాజకీయ పరమైన సభ లు, సమావేశాలు, సామాజిక, హక్కుల సంఘాలు సమస్యల పరిష్కారానికి రాష్ట్ర వ్యాప్తంగా నేతలు ఇక్కడికొచ్చే తమ గొంతుకను విన్పిస్తాయి. ముఖ్యంగా సీపీఎం పార్టీ నిర్వహణలో ఉండే సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో అ త్యధికంగా వామపక్ష భావాలు కలిగిన సంస్థల కార్యకలాపాలే అధికంగా ఇక్కడ జరుగుతాయి. ఈ క్రమంలో సుందరయ్య విజ్ఞాన కేంద్రం అంటేనే వామపక్షాలకు కేంద్ర బిందువుగా మారింది. సుందరయ్య విజ్ఞాన కేం ద్రానికి సమీపంలో నగరంలోనే ప్రముఖమైన, పేరెన్నిక గల సుందరయ్య పార్కులో 27 ఏళ్లుగా వాకర్స్ క్లబ్ ఉ న్నప్పటికీ, గత రెండేళ్లుగా సాధారణ ఎన్నికలను తల ద న్నేలా వాకర్స్ క్లబ్ ఎన్నికలు జరుగుతుండటం విశేషం.
వాకర్స్ ఎన్నికల్లో పొలిటికల్ కలర్.. సుందరయ్య పార్కులో ఇటీవల వాకర్స్ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ సెంట్రల్ ఎన్నికల నేపథ్యంలో సభ్యుల ఎంపిక, నోటిఫికేషన్, ఎన్నికల నిర్వహణకు ఆర్వో నియామకం తదితర విషయాలపై అనేక ఆరోపణలు, విమర్శలు, ప్రత్యారోపణలు, ప్రతి విమర్శలు జరిగాయి. ఏడాది పదవీ కాలం కోసం జరిగే ఈ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ పార్టీకి చెందిన బబ్లూ బలపర్చిన పాండయ్య, రమేష్ రెడ్డిలు వరుసగా గెలుపొందగా, సీపీఐ నేత వెంకటస్వామి బలపర్చిన వివేక్ ఓటమి పాలయ్యారు. గతేడాది ఎన్నికలు సాదా, సీ దాగా జరిగినప్పటికీ, ఈ ఏడాది ఎన్నికల్లో మాత్రం రాజకీయ పార్టీలు తెరవెను క ఉండి అభ్యర్థుల గెలుపుకు తీవ్రంగానే కృషి చేయడం విశేషం.
బబ్లూ వర్గానికి టీఆర్‌ఎస్, సీపీఎం పార్టీలు సంపూర్ణ మద్దతు ఇచ్చాయి. వాస్తవానికి వెంకటస్వామి బలపర్చిన వివేక్ టీఆర్‌ఎస్ పార్టీకి చెందినప్పటికీ ఆ పార్టీ నుంచి ఎలాంటి మద్దతు లభించలేదు. దీంతో సీపీఐతో పాటు అనుకోకుండా బీజేపీ మద్దతు లభించింది. సీపీఎం పార్టీ కారణంగానే ఓడిపోయినట్టు వివేక్ విలేకరుల సమావేశంలో ప్రకటించడం విశేషం. సుందరయ్య పార్కు అడ్డా కో సం..సుందరయ్య విజ్ఞాన కేంద్రం ఏరియా జీహెచ్‌ఎంసీ లెక్కల ప్రకారం రాం నగర్ డివిజన్ పరిధిలోకి వస్తోంది. రెండేళ్ల క్రితం టీఆర్‌ఎస్ కార్పొరేటర్ శ్రీనివాస్ రెడ్డిపై బీజేపీ అభ్యర్థి రవిచారి గెలుపొందారు. అప్పట్నుంచి వామపక్షాలకు అడ్డాగానున్న సుందరయ్య పార్కు ప్రాంతంపై బీజేపీ కన్నేసినట్టుగా తెలుస్తోంది. ఆ వ్యూహాంలో భాగంగానే ఎవరూ ఊహించని విధంగా సుందరయ్య విజ్ఞాన కేంద్రానికి, పార్కుకు మధ్య చౌరస్తాలో కార్పొరేటర్ రవిచారి వివేకానంద విగ్రహాన్ని ఏర్పాటు చేశారు.
ఈ అంశం సీపీఎం పార్టీకి కొంత ఇబ్బందికరంగానే మారినట్టుగా తెలుస్తోంది. సుందరయ్య పార్కు వ్యవహారాలలో సీపీఎం పార్టీకి చెందిన నేతలు దాదాపుగా బబ్లూ వర్గానికి చెందిన వారితో మొదట్నుంచి సత్సంబంధాలు కలిగి ఉంటున్నారు. ఈ పరిణామాలలో వాకర్స్ ఎన్నికల్లో సీపీఎం మద్దతుదారులను ఓడించేందుకు అనుహ్యమైన రీతిలో వివేక్‌కు బీజేపీ అంతర్గత మద్దతు తెలిపినట్టు సమాచారం. ఈ విషయాన్ని పసిగట్టిన సీపీఎం వాకర్స్ ఎన్నికల్లో రమేష్ రెడ్డి గెలుపుకోసం పనిచేయాలని విధానపరంగానే నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది. ఏది, ఏమైనా… సుందరయ్య పార్కు అడ్డగా జరుగుతున్న పరిణామాలలో ఆధిక్యత కోసం పొలిటికల్ పార్టీ లు, నేతలు ప్రధాన దృష్టిని కేంద్రీకరించినట్టుగా స్పష్టమవుతోంది.