న్యూఢిల్లీ: నేడు రాజ్యసభలో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, బిజెపి సభ్యులు వాగ్వివాదానికి దిగిన సంగతి తెలిసిందే. అది అక్కడ సభలో. కానీ తర్వాత అదే ఖర్గే, ప్రధాని మోడీ ఒకే చోట కూర్చుని సంతోషంగా విందారిగిస్తూ గడిపారు. తృణ ధాన్యాలతో చేసిన ఆహార పదార్థాల విందు సందర్భంగా వీరిద్దరూ సరసన సంభాషణతో అందరినీ ఆకట్టుకున్నారు. ఈ విందులో రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్‌కర్ కూడా పాల్గొన్నారు.
ఖర్గే రాజస్థాన్‌లో ప్రసంగిస్తూ బిజెపి దేశ స్వాతంత్య్రం కోసం ఓ శునకాన్ని కూడా పోగొట్టుకోలేదని, కాంగ్రెస్ నాయకులు ఎన్నో త్యాగాలు చేశారని అన్నారు. దీనిపై బిజెపి సభ్యులు రాజ్యసభలో ఆయనపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఖర్గే క్షమాపణ చెప్పాలని పట్టుబట్టారు. కానీ కాంగ్రెస్ అందుకు నిరాకరించింది. ఖర్గే సైతం సభ బయటి వాటికి సభలో క్షమాపణ చెప్పాల్సిన అవసరం లేదని తెగేసి చెప్పారు.
ఇదిలావుండగా 2023ను అంతర్జాతీయ తృణ ధాన్యాల(మిల్లెట్స్) సంవత్సరంగా జరుపుకోబోతున్నారు. ఈ సందర్భంగా పార్లమెంటులో మంగళవారం తృణ ధాన్యాలతో తయారు చేసిన వంటకాల విందు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ, ప్రతిపక్ష నాయకుడు మల్లికార్జున ఖర్గే, రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్‌కర్ ఒకే చోట కూర్చుని విందారగించారు. ఈ సందర్భంగా వారు ఒకరిపై మరొకరు ఛలోక్తులు విసుకుంటూ మాట్లాడుకున్నారు. ప్రధాని దీనికి సంబంధించి ఓ ట్వీట్ కూడా చేశారు.
#WATCH | Prime Minister #NarendraModi attended a millet-exclusive lunch at the Parliament House, earlier today pic.twitter.com/qp6g8yaG1W
— Hindustan Times (@htTweets) December 20, 2022
As we prepare to mark 2023 as the International Year of Millets, attended a sumptuous lunch in Parliament where millet dishes were served. Good to see participation from across party lines. pic.twitter.com/PjU1mQh0F3
— Narendra Modi (@narendramodi) December 20, 2022