తెలంగాణ ప్రభుత్వం మరో విప్లవాత్మకమైన పథకానికి శ్రీకారం చుట్టింది. రాష్ట్రంలో ఇప్పటికే ప్రారంభించిన కేసీఆర్ కిట్ సూపర్ హిట్ కాగా, ఇదే స్ఫూర్తితో కేసీఆర్ న్యూట్రీషన్ కిట్లకు రూపకల్పన చేసింది. తెలంగాణలో రేపటి నుంచి కేసీఆర్ న్యూట్రీషన్ కిట్లను రాష్ట్ర ప్రభుత్వం పంపిణీ చేయనుంది. గర్బిణులకు కోసం రాష్ట్ర ప్రభుత్వం ఈ పథకాన్ని రూ.50 కోట్లతో రూపొందించింది.
అయితే, ముందుగా అత్యధికంగా ఎనీమియా(రక్త హీనత) ప్రభావం ఉన్న 9 జిల్లాలు ఆదిలాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, జయశంకర్ భూపాలపల్లి, జోగులాంబ గద్వాల్, కామారెడ్డి, కుమ్రంభీం ఆసిఫాబాద్, ములుగు, నాగర్ కర్నూల్, వికారాబాద్ లలో ఈ కిట్లను ప్రభుత్వం పంపిణీ చేయనుంది. ప్రోటీన్స్, మినరల్స్, విటమిన్స్ లను పోషకాహారం ద్వారా అందించి రక్త హీనత తగ్గించడం, హీమోగ్లోబిన్ శాతం పెంచడం న్యూట్రీషన్ కిట్ల లక్ష్యం. ఇందులో భాగంగా ఒక్కో కిట్‌కు రూ. 1962తో రూపొందించి, కిట్లను పంపిణీ చేసేందుకు సిద్ధమైంది.
న్యూట్రీషన్ కిట్లలో ఉండేవి:
1. కిలో న్యూట్రీషన్ మిక్స్ పౌడర్
2. కిలో ఖర్జూర
3. ఐరన్ సిరప్ 3 బాటిల్స్
4. 500 గ్రాముల నెయ్యి
5. ఆల్‌బెండజోల్ టాబ్లెట్
6. కప్పు
7. ప్లాస్టిక్ బాస్కెట్