Friday, December 20, 2024

రెండో టెస్టుకు రోహిత్ దూరం

- Advertisement -
- Advertisement -

ఢాకా: బంగ్లాదేశ్‌తో జరిగే రెండో, చివరి టెస్టుకు టీమిండియా రెగ్యూలర్ కెప్టెన్ రోహిత్ శర్మ దూరమయ్యాడు. బంగ్లాదేశ్‌తో జరిగిన రెండో వన్డే సందర్భంగా రోహిత్ బొటన వేలికి గాయమైంది. దీంతో అతను చివరి వన్డేతో పాటు తొలి టెస్టు మ్యాచ్‌కు కూడా అందుబాటులో లేకుండా పోయాడు. తాజాగా గురువారం ప్రారంభమయ్యే రెండో టెస్టు నుంచి కూడా రోహిత్ వైదొలిగాడు.

ఇక ఫాస్ట్ బౌలర్ నవ్‌దీప్ సైనీ కూడా రెండో టెస్టు నుంచి వైదొలిగాడు. అతను కూడా గాయం బారిన పడ్డాడు. దీంతో అతను కూడా చివరి టెస్టుకు అందుబాటులో ఉండడం లేదు. కాగా, రెండు మ్యాచ్‌ల సిరీస్‌లో తొలి టెస్టులో నెగ్గిన టీమిండియా 10 ఆధిక్యంలో నిలిచింది. రోహిత్ స్థానంలో కెఎల్ రాహుల్ భారత్‌కు సారథ్యం వహిస్తున్నాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News