లక్నో: చదవింది ఎంబిఎ… పుష్ఫ సినిమాను ఆదర్శంగా తీసుకొని ఎర్రచందనం దొంగలించిన స్మగ్లర్‌తో పాటు ఏడుగురిని పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించిన సంఘటన ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం మథురలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… ఛత్తీస్‌గఢ్ రాష్ట్ర కంకోర్ ప్రాంతానికి చెందిన సుమిత్ దాస్ అనే యువకుడు ఎంబిఎ చదివాడు. జాబ్ కోసం పలు కంపెనీల ఇంటర్యూకు వెళ్లాడు. తక్కువ శాలరీ ఇస్తామని కంపెనీలు ఆఫర్ చేయడంతో అతడు జాబ్ చేయడానికి విముఖత చూపాడు. తక్కువ సమయంలో ఎక్కువ సంపాదించాలని నిర్ణయం తీసుకున్నాడు.
పుష్ప సినిమాను ఆదర్శంగా తీసుకొని ఎర్ర చందనందొంగతనం చేయాలని నిర్ణయం తీసుకున్నాడు. ఎర్ర చందనం దొంగలించే గ్యాంగ్ కోసం అన్వేషించాడు. ఆంధ్రప్రదేశ్ నుంచి ఓ గ్యాంగ్ సుమిత్‌కు పరిచయమైంది. సదరు గ్యాంగ్‌లో దీపక్, అజిత్ కుమార్ యాదవ్, సుమిత్, చంద్ర ప్రతాప్, సుమిత్ దాస్, జతేంద్ర, రంజిత్‌తో కలిసి వెంటనే ప్లాన్ అమలు చేశాడు. రెండు కార్లులో ఎర్ర చందనం దుంగలను మథురా నుంచి ఉత్తర ప్రదేశ్‌లోని బ్రిందబాన్‌కు తరలిస్తుండగా గోవర్ధన్ రోడ్డులో పోలీసులు చెక్ చేస్తున్నారు. ఆ సమయంలో రెండు కార్లలో చెక్ చేయగా 563 కిలోల ఎర్రచందనం దుంగలను పోలీసులు గుర్తించారు. వెంటనే ఎర్ర చందనం దుంగలను స్వాధీనం చేసుకొని ఏడుగురిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించామని పోలీసులు వెల్లడించారు.