Monday, December 23, 2024

2009 తరువాత పుట్టినవారికి పొగతాగే హక్కులేదు

- Advertisement -
- Advertisement -

న్యూజిల్యాండ్‌లో 2009 తరువాత పుట్టినవారికి సిగరెట్లు కొనడం , పొగతాగడం చట్టపరంగా పనికి రాదు. పొగతాగే అలవాటు నుంచి దేశాన్ని విముక్తి చేయాలన్న లక్షంతో కొత్తగా చట్టాన్ని రూపొందించారు. 2009 జనవరి 1 లేదా ఆ తరువాత పుట్టినవారికి పొగాకు అమ్మకూడదు. ప్రపంచంలో స్మోకింగ్ చేసే వారి వయస్సును ఏటేటా పెంచే దేశం ఇదే కావచ్చు.

అంటే సిగరెట్లను కొనుగోలు చేసే కనీస వయస్సు రానురానూ పెరుగుతుంది. ఇప్పటి నుంచి 50 ఏళ్లు ఉన్నవారికి సిగరెట్ల ప్యాక్ కొనాలంటే వారు కనీసం 63 ఏళ్ల వయసు వారని నిరూపించే గుర్తింపు కార్డు చూపించవలసి ఉంటుంది. ఈ కొత్త చట్టం పొగాకు అమ్మే రిటైల్ వర్తకుల సంఖ్యను 6000 నుంచి 600కు తగ్గిస్తుంది. పొగాకులో వినియోగించే నికొటిన్ పదార్ధ మొత్తాన్ని కూడా తగ్గిస్తుంది. పొగాకు ఉత్పత్తులను విక్రయించే అవసరం లేదు. ఎందుకంటే వీటిని వినియోగించే సగానికి సగం మంది ప్రాణాలు కోల్పోతున్నారని న్యూజిల్యాండ్ ఆరోగ్య అసోసియేట్ మంత్రి ఆయేషా వెర్రాల్ పేర్కొన్నారు.

పొగతాగడం బాగా తగ్గితే ఇక దానివల్ల వచ్చే క్యాన్సర్, గుండెపోటు, పక్షవాతం, వంటి రోగాలకు చికిత్స చేసే అవసరం కూడా అంతగా ఉండక పోవచ్చు. దీనివల్ల కొన్ని కోట్ల డాలర్ల వ్యయం పొదుపు అవుతుందని ప్రభుత్వం చెబుతోంది. న్యూజిల్యాండ్‌లో దశాబ్దం క్రితం పెద్దలు 16 శాతం మంది రోజూ పొగతాగేవారు. అయితే ఇప్పుడు ఆ సంఖ్య 8 శాతానికి తగ్గింది. బ్రిటన్‌లో 78000 మంది, అమెరికాలో 4,80,000 మంది, న్యూజిల్యాండ్‌లో 5000 మంది ఏటా స్మోకింగ్ వల్ల చనిపోతున్నారని నివేదికలు చెబుతున్నాయి. ప్రతి పది కేసుల్లో ఏడు కేసులు ఊపిరితిత్తులు, నోరు, గొంతు, కాలేయం క్యాన్సర్ కేసులే ఉంటున్నాయి. దీనికి కారణం పొగతాగడమే.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News