Thursday, October 17, 2024

వెనక్కి తగ్గని రష్యా… బైడెన్‌తో భేటీ కానున్న జెలెన్‌స్కీ

- Advertisement -
- Advertisement -

వాషింగ్టన్: ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ, అమెరికా అధ్యక్షుడు బైడెన్‌తో సమావేశం కానున్నారని అధికారవర్గాలు బుధవారం తెలిపాయి. వీరిద్దరు సమావేశమైన అనంతరం కాంగ్రెస్ సంయుక్త సమావేశంలో జెలెన్‌స్కీ ప్రసంగించనున్నారు. రష్యాతో జరుగుతున్న యుద్ధంలో తమకు సహకరిస్తున్న అమెరికాకు జెలెన్‌స్కీ కృతజ్ఞతలు తెలపనున్నారని సమాచారం. జెలెన్‌స్కీ బైడెన్‌తో భేటీ కానున్నారని వైట్‌హౌస్ అధికారులు మంగళవారం ప్రకటించారు. ఈ ఏడాది రష్యాదాడి అనంతరం జెలెన్‌స్కీ ఉక్రెయిన్‌ను విడిచి విదేశీ పర్యటన చేయడం ఇదే ప్రథమం.

ఈ సందర్భంగా ట్విట్టర్ వేదికగా జెలెన్‌స్కీ మాట్లాడుతూ అమెరికా అధ్యక్షుడితో చర్చల అనంతరం తమ రక్షణవ్యవస్థ మరింత బలోపేతం కానుందని వెల్లడించారు. గత పదినెలలుగా రష్యాతో జరుగుతున్న యుద్ధం కారణంగా ఇరుదేశాలకు చెందిన ప్రాణాలు కోల్పోగా చాలామంది తీవ్రగాయాలపాలయ్యారు. ఉక్రెయిన్‌లో సామాన్య పౌరులు కూడా ప్రాణాలు కోల్పోవడంతో దేశవ్యాప్తంగా ఎంతో విధ్వంసం జరిగింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News