పుణె: మహారాష్ట్రలో 21ఏళ్ల వైద్య విద్యార్థిని సర్పంచ్‌గా ఎన్నికైంది. జార్జియాలో ఎంబిబిఎస్ చదువుతున్న యశోధరషిండే ఎన్నికలో పోటీ చేసి విజయం సాధించింది. ఈ సంఘటన మహారాష్ట్రలోని జిల్లా మిరాజ్ తహసీల్‌లోని వడ్డి గ్రామంలో జరిగింది. సర్పంచ్‌గా ఎన్నికైన అనంతరం యశోధర మీడియాతో మాట్లాడుతూ గ్రామాభివృద్ధికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు తెలిపింది. సర్పంచ్‌గా సేవలు అందిస్తూనే ఆన్‌లైన్‌లో వైద్య కోర్సును పూర్తిచేయనున్నట్లు ఆమె వివరించింది.
గ్రామంలోని మహిళల స్వావలంబన కోసం కృషి చేస్తాను అని, విద్యార్థులకు ఈ లెర్నింగ్ ఇతర విద్య సౌకర్యాలు కలిస్తానను వెల్లడించారు. గ్రామంలోని యువత, రైతుల ఆశయాలకు అనుగుణంగా వారి అభివృద్ధికి అవసరమైన సహకారాన్ని అందిస్తాను అని వడ్డి గ్రామ సర్పంచ్ యశోధరషిండే తెలిపారు. ప్రస్తుతం తను జార్జియాలోని యూనివర్సిటీలో ఎంబిబిఎస్ నాలుగో సంవత్సరం చదువుతున్నట్లు ఆమె వివరించింది.