న్యూఢిల్లీ: పరస్పర అంగీకారంతో సహజీవనం చేయాలంటే ప్రస్తుతం ఉన్న కనీస 18ఏళ్ల వయస్సు నిబంధనలో ఎటువంటి మార్పులేదని కేంద్రం బుధవారం తెలిపింది. ఈ మేరకు బుధవారం రాజ్యసభకు సమాచారమిచ్చింది. సహజీవనం చేయాలనుకునేవారి కనీస వయస్సు 18ఏళ్ల నుంచి 16ఏళ్లుకు కేంద్ర ప్రభుత్వం తగ్గించనున్నదనే విషయంపై వివరణ ఇవ్వాల్సిందిగా ఒకరు కోరారు.
దీనిపై కేంద్ర మహిళా శిశుసంక్షేమశాఖ మంత్రి స్మృతి ఇరానీ బదులిచ్చారు. కేంద్ర ప్రభుత్వానికి అటువంటి ఉద్దేశంలేదని లిఖితపూర్వక సమాధానమిచ్చారు. ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్సువల్ అఫెన్స్ (పోస్కో) చట్టం 2012 ప్రకారం పిల్లలు ఈ చట్టం పరిధిలోకి వస్తారని, చిన్నారులపై లైంగిక వేధింపులు, నేరాలకు పాల్పడినా అటువంటివారిపై కఠినంగా శిక్షించాలని చట్టం స్పష్టంగా పేర్కొందని తెలిపారు. 2019లో చట్ట సవరణ ప్రకారం చిన్నారులపై లైంగిక మరణశిక్ష విధించే అవకాశం ఉందని సభకు తెలిపారు. పోస్కో చట్టం ప్రకారం 34 ప్రకారం ప్రత్యేక కోర్టు కేసులు విచారిస్తుందని తెలిపారు.