Saturday, December 21, 2024

టివి నటి జోర్ఫికి అత్యాచార బెదిరింపులు..వ్యక్తి అరెస్టు

- Advertisement -
- Advertisement -

 

ముంబై: టివి నటి జోర్ఫి జావేద్‌కు అత్యాచార, ప్రాణహాని బెదదిరింపులకు పాల్పడిన ఒక వ్యక్తిని ముంబై పోలీసులు అరెస్టు చేశారు. జోర్ఫి జావేద్‌పై అత్యాచారానికి పాలడి, హత్య చేస్తానంటూ బెదిరించిన నవీన్ గిరి అనే వ్యక్తిని గోరెగావ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వాట్సప్ ద్వారా నవీన్ టివి నటి జోర్ఫికి బెదిరింపు సదేశాలు పంపాడని పోలీసులు తెలిపారు. గతంలో కూడా జోర్ఫి ప్రముఖ రచయత చేతన్ భగత్‌పై సోషల్ మీడియా వేదికగా మాటల యుద్ధాన్ని కొనసాగించింది. ఒక సాహితీ కార్యక్రమంలో చేతన్ భగత్ మాటాడుతూ జోర్ఫిపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.

ఇటీవలి కాలంలో మగ పిల్లలు గంటల కొద్దీ తమ ఫోన్లలో ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ చూడడంలో గడుపుతున్నారని, జోర్ఫి జావేద్ ఎవరో ప్రతి ఒక్కరికీ తెలుసునని, ఆమె ఫోటోలను చూస్తే ఏమొస్తుందని చేతన్ భగత్ ప్రశ్నించారు. పరీక్షలలో ఆమె గురించి అడుగుతారా లేక ఇంట్వూలో ఆమె వేసుకున్న దుస్తుల గురించి అడుగుతారా అంటూ ఆయన నిలదీశారు. దీనిపై జోర్ఫి ఘాటుగా స్పందిస్తూ చేతన్ భగత్ లాంటి పురుషులు తమ లోపాలను గుర్తించకుండా మహిళలను మాత్రమే ఎప్పుడూ నిందిస్తారని, అత్యాచార సంస్కృతిని ప్రోత్సహించడం మానుకోవాలని హితవు చెప్పారు. మగవారి ప్రవర్తనకు మహిళల వస్త్రధారణను సాకుగా చూపడం 80వ దశకం నాటి మాటని ఆమె కౌంటర్ ఇచ్చారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News