Saturday, January 11, 2025

పెళ్లి కావడం లేదంటూ బ్రహ్మచారుల ఊరేగింపు

- Advertisement -
- Advertisement -

 

న్యూస్‌డెస్క్: దేశంలో ఆడపిల్లల జనాభా తగ్గిపోతోందని చెప్పడానికి ఇంతకన్నా నిదర్శనం ఏం కావాలి..పెళ్లి చేసుకోవడానికి తమకు అమ్మాయిలు దొరకడం లేదంటూ పెద్దసంఖ్యలో బ్రహ్మచారులు ఇటీవల మహారాష్ట్రలోని సోలాపూర్‌లో ఒక బ్రహ్మాండమైన ఊరేగింపు నిర్వహించారు. పెళ్లి దుస్తులు ధరించి పెళ్లి కొడుకులుగా తయారైన వందలాది మంది యువకులు తాము పెళ్లి చేసుకోవడానికి అమ్మాయిలను వెతికిపెట్టాలంటూ జిల్లా కలెక్టర్‌కు వినతిపత్రం సమర్పించారు. మహారాష్ట్రలో పురుషులతో పోలిస్తే మహిళల జనాభా తగ్గిపోయిందని, ప్రతి వెయ్యి మంది పురుషులకు కేవలం 889 మంది మహిళలు మాత్రమే ఉన్నారంటూ వారు తమ వినతిపత్రంలో వాపోయారు.

ఈ నిష్పత్తిని పెంచడానికి ప్రభుత్వం చర్యలు చేపట్టాలని, లింగ నిర్ధారణ పరీక్షల నిషేధ చట్టాన్ని కఠినంగా అమలు చేసి ఆడపిల్లల సంఖ్య పెరిగేలా చూడాలని బ్రహ్మచారులు కోరారు. పనిలోపనిగా తమ కోసం వధువులను వెతికిపెట్టి పెళ్లి చేయాలంటూ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆ బ్రహ్మచారులు అర్థించారు. పెళ్లి దుస్తులలో గుర్రాల మీద ఎక్కి ఊరేగింపుగా వెళుతున్న తమను చూసి కొందరు నవ్వుకోవచ్చని, కాని పెళ్లీడు దాటినా బ్రహ్మచారులుగా మిగిలిపోతున్న తమ బాధ ఎవరికి చెప్పుకోవాలంటూ ఈ యాత్రను నిర్వహించిన జ్యోతి క్రాంతి పరిషద్ వ్యవస్థాపకుడు రమేష్ బరస్కర్ ఆవేదన వ్యక్తం చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News