Monday, November 18, 2024

ఏ పనైనా సులువుగా చేసే రోబో డాగ్

- Advertisement -
- Advertisement -

మానవ నాగరికతను కిల్లర్ రోబోలు శాసిస్తాయేమోనన్న భయం వెంటాడుతున్న సమయంలో నిర్మాణాత్మక పనుల్లో సహకరించే ఒక కార్మికుని రీతి రోబోను తయారు చేయడం విశేషం. బ్రిడ్జిలు, అంతస్థుల భవనాలు, నౌకలు, తదితర భారీ నిర్మాణాలలో సాధారణంగా కూలీలు ఏ పనిచేసినా ప్రమాదాలు పొంచి ఉంటాయి. నౌకలపై వెల్డింగ్, చమురుబావుల డ్రిల్లింగ్, గనుల తవ్వకం వంటి పనులు ఎంతో ప్రమాదకరమైనవి. ఇలాంటి పనులు చేయడానికి తగిన రోబో డాగ్ ను కొరియా అడ్వాన్స్‌డ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ సంస్థకు చెందిన పరిశోధకులు తయారు చేశారు.

దీని మాగ్నెటికల్లీ ఎడెసివ్ రోబోట్ ఫర్ వెర్సటైల్ అండ్ ఎక్స్‌పీడియస్ లోకోమోషన్ సాంకేతిక పరిజ్ఞానాన్ని పొందుపరిచే విధంగా మార్వెల్ (ఎంఎఆర్‌డబ్లుఇఎల్ ) అని పేరు పెట్టారు. ఇంచుమించు ఒక పెంపుడు కుక్కలా కనిపించే దీనికి నాలుగు కాళ్లు , మొండెం ఎలెక్ట్రానిక్స్ పరికరాలతో అమర్చగా, పాదాలు మాత్రం అయస్కాంత మెత్తలతో తయారయ్యాయి. ఈ పాదాలు రబ్బరు వంటి అయాస్కాంతాలతో అమరి ఉంటాయి. ఈ రోబో డాగ్ గోడలు, భవనాల పైకప్పులు సులువుగా ఎక్క గలుగుతుంది. పాదాలు పట్టు తప్పిపోకుండా గట్టిగా గోడను పట్టుకుని ఉంటాయి.

సెకండుకు 1.6 అడుగుల వంతున గోడలను ఎక్క గలిగితే, సెకండుకు రెండు అడుగుల వంతున పైకప్పులు ఎక్కగలదు. అలాగే వీపు వెనుక ఊతంతో కూడా నడవ గలదు. బహుముఖ చలన సామర్థం కలిగి ఉన్నందున చకచకా నడిచి పనులన్నీ చేయగలుగుతుంది. నాలుగు పౌండ్ల బరువుతో గోడలు పట్టుకుని ఎక్కగలుగుతుంది. అలాగే ఏడు పౌండ్ల బరువుతో పైకప్పు పైకి వెళ్ల గలుగుతుంది. వీపున ఆరు పౌండ్ల బరువు మోస్తూ పైకి వెళ్తుంది. మామూలుగా 18 పౌండ్ల బరువు ఎత్త గలుగుతుంది. పైకప్పు ఎక్కుతున్నప్పుడు తొండ మాదిరి దీని కదలిక ఉంటుందని పరిశోధకులు చెబుతున్నారు. అదుపు చేయడానికి, లేదా ఆపడానికి ఎలాంటి పగ్గాలు అవసరం లేకుండానే స్వయం చోదక శక్తితో పనిచేస్తుందని పరిశోధకులు వివరిస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News