Monday, December 23, 2024

ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డిని కలిసిన కోర్విపల్లి గ్రామస్థులు

- Advertisement -
- Advertisement -

చిన్నశంకరంపేటః గ్రామాభివృద్ధి కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలని ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి సూచించారు. మండల పరిధిలోని కొర్విపల్లి గ్రామస్థులు గురువారం కొంపల్లిలోని ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి నివాస గృహంలో కలిసి గ్రామ సమస్యలను వివరించి, శాలువ పూలమాలతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ… కొర్విపల్లి గ్రామ పంచాయతీ భవనంతోపాటు కుర్మ సంఘ భవన నిర్మాణానికి నిధులు మంజూరు చేస్తారని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్ మండల శాఖ అద్యక్షుడు పట్లోరి రాజు, సర్పంచ్ పద్మ, మాజీ సర్పంచ్ మైనంపల్లి రంగారావు, ఉప సర్పంచ్ సంతోష్, బిఆర్‌ఎస్ నాయకుడు మల్లేశ్, వార్డు సభ్యులు, గ్రామస్థులు ఉన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News