- Advertisement -
మాచారెడ్డి మండలంలోని చుక్కాపూర్ లక్ష్మీ నర్సింహా స్వామి ఆలయంలో చోరీ జరిగినట్లు పోలీసులు తెలిపారు. చుక్కాపూర్ లక్ష్మీ నర్సింహా స్వామి ఆలయంలోని మూడు హూండీలలోని కానుకలను నగదును దొంగలు ఎత్తుకెళ్లినట్లు ఎస్సై సంతోష్ కుమార్ తెలిపారు. సాయంత్రం ఆలయ పూజారి పూజా కార్యక్రమాలు ముగించిన అనంతరం ఇంటికి వెళ్లాడు. వాచ్మెన్ భోజనం కోసం ఇంటికి వెళ్లి సమయంలో దొంగలు దోపిడికీ పాల్పడ్డట్లు తెలిపారు. క్లూస్ రప్పించి సీసీ ఫుటేజి ఆధారంగా దొంగలను గుర్తించడానికి పోలీసులు దార్యప్తు ప్రారంభించినట్లు ఎస్సై పేర్కొన్నారు.
- Advertisement -