- Advertisement -
పెనుబల్లిః సత్తుపల్లి నియోజకవర్గ అభివృద్ధి కొరకు రూ. 100 కోట్లు ఎస్డీఎఫ్ నిధులు మంజూరు చేయాలని కోరుతూ హైదరాబాద్ ప్రగతి భవన్‌లో గురువారం నాడు సిఎం కెసిఆర్ ను సత్తుపల్లి ఎంఎల్ఎ సండ్ర వెంకట వీరయ్య కలిసి వినతి పత్రం అందజేశారు. సత్తుపల్లి మండల పరిధిలోని బేతుపల్లి చెరువు మోడ్రైజేషన్, లంకాసాగర్ ప్రాజెక్టు మోడ్రైజేషన్, ఎన్టీఆర్ కెనాల్ మరమ్మత్తులు, సత్తుపల్లి నియోజకవర్గంలోని లిఫ్ట్ ఇరిగేషన్లకు తల్లాడ నుండి కొడవటిమెట్టకు, బస్వాపురం నుండి పెద్దకోరుకొండికి, చిన్నకోరుకొండి నుండి ఆర్లపాడుకు, గణేష్‌పాడు నుండి గంగదేవిపాడుకు ఆర్‌అండ్‌బి రోడ్లు, పంచాయితీ రాజ్ శాఖ నుండి లింక్ రోడ్ల నిర్మాణాలకు నిధులు మంజూరు చేయాలని సిఎం కెసిఆర్ ను ఎంఎల్ఎ సండ్ర వెంకట వీరయ్య కొరారు.
- Advertisement -