Sunday, December 22, 2024

కైకాల సత్యనారాయణ మృతిపట్ల కెసిఆర్ సంతాపం…

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: ప్రముఖ నటుడు కైకాల సత్యనారాయణ మృతి పట్ల ముఖ్యమంత్రి కె. చంద్ర శేఖర్ రావు సంతాపం తెలిపారు. చలన చిత్ర రంగంలో తొలితరం నటుడిగా పలు విభిన్నమైన పాత్రలను పోషిస్తూ తన వైవిధ్యమైన నటన ద్వారా, మూడు తరాల తెలుగు ప్రేక్షకుల అభిమానాన్ని పొందారని సిఎం గుర్తుచేశారు. కైకాల సత్యనారాయణ మరణం తెలుగు చలన చిత్ర రంగానికి తీరని లోటని సిఎం కెసిఆర్ విచారం వ్యక్తం చేశారు. వారి కుటుంబ సభ్యులకు సిఎం కేసిఆర్ తన ప్రగాఢ సంతాపాన్ని తెలిపారు. సినీ నటుడు కైకాల సత్యనారాయణ శుక్రవారం ఉదయం కన్నుమూశారు. గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న కైకాల సత్యనారాయణ ఇవాళ తుది శ్వాస విడిచిన విషయం తెలిసిందే.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News