Monday, December 23, 2024

క్రీస్తుకు పురుడు పోసిన మంత్రసాని సమాధి

- Advertisement -
- Advertisement -

జెరాసలెం లోని అటవీ ప్రాంతంలో సమాధి గుహ ఒకటి బయటపడింది. అది ఏసుక్రీస్తు ప్రసవించే సమయంలో తల్లి మేరీకి పురుడు పోసిన మంత్రసాని సమాధి అని నమ్ముతున్నారు. ఈ సమాధిని మొదట 1982 లో దొంగలు తవ్వితీశారు. అందులో 2000 సంవత్సరాల క్రితం ఉంచిన అవశేషాలు కొన్నిటిని దొంగలు కాజేశారు. రెండేళ్ల తరువాత అధికారిక తవ్వకాలు మొదలయ్యాయి. కానీ తాజా ఆవిష్కరణలో ఈ గుహ “పవిత్ర సలోమ్‌” దని నిరూపణ అయినట్టు పురాతత్వశాస్త్రవేత్తలు ధ్రువీకరిస్తున్నారు. అక్కడి గోడపై చెక్కిన చెక్కడాలు చదివితే “మేరీ మంత్రసాని సలోమ్ ” అని స్పష్టంగా వివరించి ఉంది.

ఈ అక్షరాలు ప్రాచీన గ్రీకు, అరబిక్ భాషల్లో ఉన్నాయని, ఇది సలోమ్ గుహ అని నిరూపించడానికి ఈ సాక్షాలు సరిపోతాయని ఇజ్రాయెల్ యాంటిక్విటీస్ అథారిటీ (ఐఎఎ) వెల్లడించింది. ఏసుక్రీస్తు సేవకుల్లో ఒకరైన జేమ్స్ తను వెల్లడించిన సువార్తలో మేరీ మంత్రసాని సలోమ్ ప్రస్తావన ఉంది. జీసస్ ప్రసవించే సమయంలో ఆమె మంత్రసానిగా సహకరించిందని జేమ్స్ వివరించారు. అయితే ఈ కథనాన్ని పశ్చిమ ప్రాంత చర్చిలు తొలగించాయి. సలోమ్ బెత్లహోమ్ నుంచి వచ్చి పురుడు పోశారు. సలోమ్ పేరు అన్నది సెకండ్ టెంపుల్ కాలంలో సర్వసాధారణమైనది. హిబ్రూలో షలోమ్ లేదా ష్లోమిట్ అని పిలుస్తారు. ఒక అవివాహిత అయిన కన్యకు పురుడు పోయడానికి తనను పిలుస్తారని ఆమె అనుకోలేదు.

బిడ్డ ఊయెల పట్టుకోగానే ఆమె చేయి పొడిగా మారి, నయం అయింది అని క్రీస్తు వివరాల్లో పేర్కొని ఉంది. అయితే బైబిల్‌లో మేరీకి సలోమ్ రెండో మంత్రసాని అయి ఉండవచ్చని వివరించి ఉంది. “మంత్రసాని గుహ నుంచి బయటకు వెళ్లినప్పుడు సలోమ్ ఆమెను కలుసుకోగా ఆమె సలోమ్‌తో నేను నీకొక కొత్త దృశ్యాన్ని చెప్పాలి. ఒక కన్య ప్రసవించింది. ఆమె స్వభావం అనుమతించక పోయినా ఇది జరిగింది. అని ఆమె చెప్పగా, దానికి సలోమ్ .. నా దేవుడైన ప్రభువు జీవించి ఉండక పోతే …నేను విచారించి ఆమె స్వభావాన్ని నిరూపించలేకుంటే, కన్య ప్రసవించడాన్ని నేను నమ్మను.

” గుహ గోడలపై ఈ చెక్కుడు రాతల్లో ఇవన్నీ వివరించి ఉన్నాయి. సలోమ్ పేరు తరువాత అనేకసార్లు చూపడమైంది. జీసస్ జెరూసలెంలోకి ప్రవేశించేవరకు జీసస్ గురించి ఎవరికీ చెప్పవద్దని సలోమ్‌కి మేరీ చెప్పేది. సమాధి దోపిడీ ముఠా 1982లో ఈ సమాధిని కనుగొన్నారు. వివరణలతో కూడిన శిలా శవ పేటికను దొంగిలించారు. ఇదంతా జరిగిన రెండేళ్లకు అధికారికంగా అక్కడ తవ్వకాలు ప్రారంభమయ్యాయి. ఈ గుహలో అనేక గదులు ఉన్నాయి. సమాధి చేసిన సంపదలతో , పగిలిన రాతి పెట్టెలతో ఇవి నిండి ఉన్నాయి. యూదుల ఖనన ఆచారం ప్రకారం ఇవన్నీ పూడ్చబడ్డాయని ధ్రువీకరిస్తున్నారు. యూదుల సంప్రదాయమైన రాతి పెట్టెల్లో ద్వితీయ ఖననానికి సంబంధించి పురావస్తు రికార్డుల్లో ప్రముఖంగా ప్రస్తావించారు. అయితే క్రైస్తవ ప్రార్థనామందిరంగా ఈ గుహను అనుసరించడమే విస్మయం కలిగిస్తోంది. శిలువలు, తూర్పు రోమన్, పూర్వపు ఇస్లాం కాలాల నాటి రాతలు గుహ గోడలపై లిఖించి ఉండటం వీటన్నిటి కారణంగా ఈ గుహ క్రైస్తవ ప్రార్థన మందిరంగా న్యాయ నిర్ణయమైందని ఇజ్రాయెల్ యాంటిక్విటీస్ ప్రకటనలో పేర్కొంది.

2000 ఏళ్ల క్రితం ఈ గుహసమాధి నిర్మాణమైనప్పటికీ, ఆ తరువాత ఇది వెలుగు లోకి వచ్చినప్పటికీ, విశాలమైన గుహ ముందు భాగం ఇప్పుడు మనం చూడగలుగుతున్నాం. ఈ ముందు భాగం 3767 చదరపు అడుగుల విస్తీర్ణంలో విస్తరించింది. చుట్టూ చక్కని రాతి గోడలున్నాయి. గోడలకు చతురస్రాకార రాళ్లు దేనికవే అమర్చి ఉన్నాయి. గుహ ముందు భాగంలో ఒకప్పుడు మొజాయిక్ నేలతో చదును చేయబడి యుండడం కూడా బయటపడింది. పురావస్తు శాస్త్ర పరిశోధకుల బృందం ఎనిమిది, తొమ్మిది శతాబ్దాల నాటి దుకాణాల శిధిలాలను కూడా వెలుగు లోకి తెచ్చారు. ఆ దుకాణాలు ప్రార్థనకు ఉపయోగించే చమురును విక్రయించేవి. నాలుగవ శతాబ్దం వరకు క్రిస్మస్ వేడుకలను రోమన్ కేథలిక్ చర్చి నిర్వహించేది కాదు. తరువాత క్రిస్మస్ వేడుకలను జరుపుకోవడం ఆనవాయితీగా మారింది. క్రీస్తు వెనుక 354 నాటి రోమన్ తత్వవేత్త క్యాలెండర్ ప్రకారం డిసెంబర్ 25న ఏసుక్రీస్తు జయంతిని జరుపుకొంటున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News