Monday, January 20, 2025

పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ మాజీ భార్యకు మళ్లీ పెళ్లి

- Advertisement -
- Advertisement -

ఇస్లామాబాద్: పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ మాజీ భార్య రేహమ్ ఖాన్(49) మళ్లీ వివాహం చేసుకున్నారు. నటుడు, మోడల్ మీర్జా బిలాల్ బేగ్(36)ను తాను వివాహం చేసుకున్నట్లు ఆమె శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. కాగా తనకన్నా 13 ఏళ్ల చిన్నా వాడిని ఆమె వివాహం చేసుకోవడం గమనార్హం. తన కుమారుడు, మీరా తల్లిదండ్రుల ఆశీస్సులతో అమెరికాలోని సీటెల్‌లో తమ వివాహం జరిగిందని తెలిపారు. ఎట్టక్లేకు తనకు నమ్మదగిన వ్యక్తి లభించాడని రేహమ్ ఒక ట్వీట్‌లో తెలిపారు. పెళ్లి ఉంగరాలు కనిపించే విధంగా ఓ ఫోటోను ట్విట్టర్‌లో ఆమె పంచుకున్నారు. రేహమ్, మీర్జాలు ప్రస్తుతం అమెరికాలో నివసిస్తున్నారు.

ఇద్దరికీ ఇది మూడో పెళిల కావడం విశేషం. పాకిస్థానీబ్రిటీష్ జర్నలిస్టు అయిన రేహమ్ మొదట 1993లో సైకియాట్రిస్ట్ అయిన ఇజాజ్ రెహమాన్‌ను వివాహం చేసుకున్నారు. 2005లో వీరిద్దరూ విడాకులు తీసుకున్నారు. 2014లో ఆమె ఇమ్రాన్‌ను వివాహం చేసుకున్నారు. అయితే10 నెలలకే వీరిద్దరూ విడిపోయారు.తనకు వ్యతిరేకంగా పాకిస్థాన్‌లో దుష్ప్రచారం జరిగిందని, అందుకే ఇమ్రాన్‌తో తన బంధం నిలవలేదని గతంలో ఆమె ఆరోపించారు. మీర్జా గతంలో మోడల్‌గా పని చేశారు. ప్రస్తుతం ఆయన అమెరికాలో కార్పొరేట్ ప్రొఫెషనల్.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News