Saturday, December 21, 2024

ట్యాంక్‌బండ్‌పై ట్రాఫిక్ ఆంక్షలు

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ, హైదరాబాద్ : ఈ నెల 24వ తేదీన ట్యాంక్‌బండ్‌పై ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తూ హైదరాబాద్ జాయింట్ పోలీస్ కమిషనర్ ట్రాఫిక్ ఆదేశాలు జారీ చేశారు. మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకు ఆంక్షలు అమలులో ఉంటాయని తెలిపారు. టిఎస్‌ఆర్‌టిసి సూపర్ లగ్జరీ ఎలక్ట్రికల్ బస్సులను శనివారం ట్యాంక్ బండ్‌పై ప్రారంభించనుంది. ఈ సందర్భంగా పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. వాహనదారులు ట్రాఫిక్ ఆంక్షలను దృష్టిలో పెట్టుకుని ప్రత్యామ్నాయమార్గాల్లో వెళ్లాలని కోరారు.

రాణిగంజ్ నుంచి అప్పర్ ట్యాంక్‌బండ్‌కు వెళ్లే వాహనాలను సేయిలింగ్ క్లబ్ మీదుగా కవాడిగూడ ఎక్స్ రోడ్డు, డిబిఆర్ మిల్స్ వైపు మళ్లిస్తారు.

లిబర్టీ నుంచి అప్పర్ ట్యాంక్‌బండ్ వైపు వెళ్లే వాహనాలను అంబేద్కర్ స్టాట్యూ మీదుగా తెలుగుతల్లి, ఇక్బాల్ మీనార్ వైపు వెళ్లాలి.

తెలుగు తల్లి నుంచి అప్పర్ ట్యాంక్‌బండ్‌పైకి వెళ్లే వాహనాలను అంబేద్కర్ స్టాట్యూ మీదుగా లిబర్టీ, హిమాయత్‌నగర్ మళ్లిస్తారు.

ముషీరాబాద్ ఎక్స్ రోడ్డు నుంచి అప్పర్ ట్యాంక్‌బండ్ వెళ్లే వాహనాలను కవాడిగూడ ఎక్స్ రోడ్డు, లోయర్ ట్యాంక్‌బండ్ వైపు వెళ్లాలి.

డిబిఆర్ మిల్స్, అప్పర్ ట్యాంక్‌బండ్ వెళ్లే వాహనాలను డిబిఆర్ మిల్స్, గోశాలా, కవాడిగూడ, జబ్బార్ కాంప్లెక్స్, బైబిల్ హౌస్ మళ్లిస్తారు.

ఇక్బాల్ మినార్ నుంచి వచ్చే వాహనాలను ఓల్డ్ సెక్రటేరియట్, తెలుగు తల్లి ఫ్లైఓవర్ మీదుగా లోయర్ ట్యాంక్‌బండ్ వైపు వెళ్లాలి.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News