Monday, January 20, 2025

రోడ్డు ప్రమాదంలో యువతి మృతి

- Advertisement -
- Advertisement -

నారాయణరావు పేట : కారు డ్రైవర్ అతి వేగం అజాగ్రత్తతో యువతి మృతి చెందిన సంఘటన నారాయణరావుపేట మండల పరిధిలోని మల్యాల గ్రామ శివారులో శుక్రవారం చోటు చేసు కుంది. రెండు రోజుల్లో పోలీస్ ఉద్యోగానికి ఫిజికల్ టెస్టులకు హాజరై తల్లిదండ్రుల కలలు సాకారం చేస్తుంది అనే లోపే రోడ్డు ప్రమాదంలో ఆ యువతి మరణించింది. చిన్నకోడూరు పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం… గుర్రాల గొంది గ్రామానికి చెందిన బెజగాం సంద్య (22) తన తల్లిదండ్రులతో కలిసి గురువారం చిన్నకోడూరు మండలం రామునిపట్ల గ్రామంలో పోచమ్మ బోనాల పండుగకు వెళ్లారు.

శుక్రవారం తిరిగి గ్రామానికి తన తమ్ముడు యశ్వంత్‌తోకలిసి హోండా యాక్టివా ద్విచక్ర వాహానం పై వస్తుండగా సిరిసిల్ల నుండి సిద్దిపేట వైపు వెలుతున్న కారు ద్విచక్ర వాహనాన్ని ఢీ కొట్టింది. దీంతో ఇద్దరికి గాయాలు కావడంతో వెంటనే 108 వాహానంలో సిద్దిపేటలో ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ మశోద ఆసుపత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి మృతి చెందింది.సంద్య తండ్రి బేజగాం లింగం ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News