Monday, December 23, 2024

కాసేపట్లో ప్రభుత్వ లాంఛనాలతో కైకాల అంత్యక్రియలు

- Advertisement -
- Advertisement -

ప్రముఖ నటుడు కైకాల సత్యనారాయణ పార్థివదేహానికి అంతిమయాత్ర ప్రారంభమైంది. కాసేపట్లో ప్రభుత్వ లాంఛనాలతో కైకాల అంత్యక్రియలు జరగనున్నాయి. కాగా.. శుక్రవారం తెల్లవారుజామున 4 గంటలకు ఈ సీనియర్ నటుడు ఇహలోకాన్ని వీడారు. దాదాపు ఆరు దశాబ్దాల పాటు అజేయంగా సాగిన తన కెరీర్‌లో కైకాల సత్యనారాయణ 777కు పైగా చిత్రాల్లో నటించారు. ఎన్టీఆర్‌తో కలిసి కైకాల సత్యనారాయణ 101 చిత్రాల్లో నటించారు. అలాగే మెగాస్టార్ చిరంజీవితోనూ పలు విజయవంతమైన చిత్రాల్లో కైకాల నటించారు. సినిమాల్లో నటించడమే కాకుండా పలు చిత్రాలను నిర్మించారు. ఆయన పౌరాణిక, సాంఘిక, చారిత్రక, జానపద పాత్రలు చేశారు. ప్రతినాయక, నాయక, హాస్య, సహాయ పాత్రలనెన్నింటినో పోషించారు. తాను పోషించిన వైవిధ్యమైన పాత్రలకు గుర్తింపుగా ఆయన నవరస నటనా సార్వభౌమ అనే బిరుదు పొందారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News