Friday, December 20, 2024

ఎపిలో 2లక్షల కిలోల గంజాయి దహనం

- Advertisement -
- Advertisement -

ఆంధ్రప్రదేశ్ పోలీసులు అనకాపల్లి జిల్లాలో రెండు లక్షల కిలోల గంజాయి, 131 లీటర్ల హాష్ ఆయిల్‌ను దహనం చేశారు. శనివారం డ్రగ్స్ డిస్పోజల్ కమిటీ అధ్వర్యంలో అనకాపల్లి జిల్లా కోడూరులోని నిర్మానుష్య ప్రదేశంలో ఈ గంజాయిని ధ్వంసం చేశారు. గంజాయి అక్రమ రవాణపై ఎపి సరిహద్దు ప్రాంతాల్లో చెక్‌పోస్టుల వద్ద గట్టి నిఘా పెట్టినట్లు తెలిపారు.

విశాఖ రేంజ్ పరిధిలో ఇప్పటి వరకు ఏడుసార్లు గంజాయిని ధ్వంసం చేసినట్లు తెలిపారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో కోడూరులో రూ.300 కోట్ల విలువైన గంజాయిని పోలీసులు ధ్వంసం చేశారు. ఇదిలావుండగా ఏలూరు రేంజ్ పరిధిలో 64,832 కిలోల గంజాయిని దహనం చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News