Monday, December 23, 2024

అమెరికాలో మంచు తుఫానుకు స్తంభించిన జనజీవనం

- Advertisement -
- Advertisement -
క్రిస్మస్ వేడుకలకు దెబ్బ…ఇళ్లకే పరిమితమైన జనులు

వాషింగ్టన్: అమెరికాలో ‘బాంబ్ సైక్లోన్’ అనే మంచు తుఫాను కారణంగా ఈ ఏడాది క్రిస్మస్ వేడుకలకు అంతరాయం ఏర్పడింది. ఈ మంచు తుఫానుకు ‘ఇలియట్’ అని పేరు పెట్టారు. ఈ మంచు తుఫాను కెనడాలోని గ్రేట్ లేక్స్ నుంచి రియో గ్రాండే వరకు 2000 మైళ్లు విస్తరించింది. ఉష్ణోగ్రత సాధారణం కంటే బాగా పడిపోయాయి. అనేక ప్రాంతాల్లో జనులు ఇళ్లకే పరిమితం అయ్యారు. బలమైన ఈదురు గాలుల కారణంగా విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. కోట్లాది మంది చీకటిలోనే గడపాల్సి వచ్చింది. సహాయక, పునరుద్ధరణ చర్యలకు అవరోధాలు ఏర్పడుతున్నాయి. ఉష్ణోగ్రత అనేక ప్రాంతాల్లో మైనస్ 45 డిగ్రీల నుంచి మైనస్ 37 డిగ్రీల వరకు నమోదయింది. న్యూయార్క్, టెనెస్సే, వాషింగ్టన్ డిసిల్లో ఉష్ణోగ్రతలు మైనస్ 9 డిగ్రీల వరకు పడిపోయాయి.

విమాన సర్వీసులు కూడా రద్దు కావడంతో వేలాది మంది ప్రయాణికులు విమానాశ్రయాల్లోనే చిక్కుకుపోయారు. 7423 విమానాలు ఆలస్యంగా నడుస్తుండగా, 3426 విమానాలను రద్దు చేశారు. ‘ఫ్లయిట్ అవేర్’ ఈ వివరాలను వెల్లడించింది.
కొన్ని దశాబ్దాలలో ఇదే అత్యంత దారుణమైన తుఫానుగా దీన్ని పేర్కొంటున్నారు. హైవేల్లో వాహనాల ఢీ రెట్టింపయింది. ముందున్నవి కనిపించడం కూడా కష్టతరంగా మారిపోయింది. అంతగా మంచుకురుస్తోంది.

న్యూయార్క్‌లో గవర్నర్ కేథి హోచుల్ ‘అత్యవసరస్థితి’ని ప్రకటించారు. బఫెల్లో ప్రాంతంలో నేషనల్ గార్డ్‌ను మోహరించనున్నట్లు ప్రకటించారు. రాగల 24 గంటలలో మంచు రెండు నుంచి నాలుగు అడుగుల వరకు పేరుకుపోనున్నట్లు హెచ్చరికలు జారీ అయ్యాయి. ఈ తుఫాను కేటగిరి 3 రకానికి చెందిందని అంటున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News